తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో... ఏకంగా 11 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ 11 మంది ఐఏఎస్ అధికారులు వెళ్లిపోయారు. ఈ 11 మంది ఐఏఎస్ అధికారులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె... రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు... కీలక శాఖలోనే ఉన్నారు.

 

దానికి తగ్గట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహం కూడా ఆమె కు దక్కింది. జి హెచ్ఎం సి కమిషనర్ గా... మొన్నటి వరకు ఆమ్రపాలి పనిచేయడం జరిగింది. జిహెచ్ఎంసి కమిషనర్ బాధ్యతలే కాకుండా... మరో నాలుగు శాఖలను చూసుకున్నారు. అయితే అలాంటి ఆమ్రాపాలి.. లాంటి అధికారులు 11 మంది... ఏపీకి వెళ్లిపోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు... సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు.

 

అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆమ్రపాలి...  పాత్రను ఎవరు భర్తీ చేస్తారని కొత్త చర్చ మొదలైంది. అయితే ఈ నేపథ్యంలోనే... స్మిత సబర్వాల్ పేరు వినిపిస్తోంది. స్మిత సబర్వాల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు కీలక శాఖలకు పని చేశారు. కెసిఆర్  కార్యాలయంలోనే ఆమెకు పెద్ద పదవి ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్మిత సబర్వాల్ ను పక్కకు పెట్టారు.

 

కానీ ఇప్పుడు ఆమ్రపాలి లేకపోవడంతో...  మళ్లీ స్మిత సబర్వాల్ కు బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. త్వరలోనే హైదరాబాద్ కు సంబంధించిన కీలక పోస్టు... స్మితా సబర్వాల్ కు ఇవ్వనున్నారట.  అలాగే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు కూడా... ప్రత్యేక అధికారిగా స్మితా సబర్వాల్ ను  నియమించబోతున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: