వైయస్సార్ కుమార్తె అన్న కారణంతోనే కాంగ్రెస్ పార్టీ ఈమెకు అత్యున్నత పదవిని కట్టబెట్టింది. ఆమె వల్ల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలం పుంజుకుంటుందని, కనీసం పార్టీకి నాలుగు ఓట్లైనా వస్తాయని ఆలోచించింది. అయితే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల మేలు కంటే కీడే పార్టీకి ఎక్కువగా జరుగుతుందనే చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీనికి తోడు ఆమె ఆలోచనలను సొంత పార్టీ మీద పెడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య తనకు తన అన్న జగన్ తో ఉన్న పూర్తి వ్యక్తిగత కారణాలే దీనికి ప్రధాన కారణం. ఒకవైపు ఆమెకు వారితో ఆస్తుల వివాదాలు ఉన్నా లేకున్నా అవన్నీ కూడా పూర్తిగా సొంత విషయాలే కిందకి లెక్కకు వస్తాయి. ముఖ్యంగా వీటికి న్యాయస్థానాలు.. సరైన పరిష్కారం ఇవ్వాలి. ఇక్కడ ఆమె వాటి విషయం తేల్చుకుంటూ ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి కూటమి ప్రభుత్వం మీద కూడా నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది.
కానీ షర్మిల చేస్తుంది ఏంటి ..? పిసిసి చీఫ్ ట్యాగ్ని వాడుకుంటూ ఆస్తి వివాదాలతో నిండా మునిగిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈమె పొలిటికల్ గా ఎదగలేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి . ఒకానొక సమయంలో షర్మిల బాధితురాలు అని మొదట్లో వినిపించినా చివరికి ఎవరి వాదనలు వారివి వినిపిస్తున్నాయి. అందుకే ఈ విషయంలో షర్మిలకు మద్దతు పెద్దగా లభించడం లేదని సమాచారం. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేయడం లేదు. కాబట్టి అన్నతో పెట్టుకుంటే ఇప్పుడు పదవి కూడా పోయేటట్టుంది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.