దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ లో జరుగుతున్న రేవ్ పార్టీని భగ్నం చేశారట. ఈ సందర్భంగా దాదాపు 42 మందిని అరెస్టు చేశారట పోలీసులు. అంతేకాదు ఈ సందర్భంగా డ్రగ్స్ తో పాటు విదేశీ మద్యం కూడా... దొరికినట్లు పోలీసులు ప్రకటించారు. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో... ప్రముఖ వ్యాపారవేత్త కూడా ఉన్నారట. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు, సాఫ్ట్వేర్ సీఈవో విజయ్ మద్దూరి... ఈ పార్టీలో దొరికినట్లు తెలుస్తోంది.
ఆయనకు డ్రగ్స్ టెస్టులు చేస్తే పాజిటివ్ కూడా వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో వెంటనే కేటీఆర్ సన్నిహితుడు విజయ్ మద్దూరిని అరెస్టు చేసి.... కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాకుండా ఈ 42 మందిలో దాదాపు 14 మంది అమ్మాయిలు ఉన్నట్లు.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 21 మంది అబ్బాయిలు కూడా ఉన్నారట. వీరిలో విదేశీ అమ్మాయిలు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ రేవ్ పార్టీకి... ప్రముఖ రాజకీయ నేత కూడా హాజరైనట్లు... రేవంత్ రెడ్డి కి సంబంధించిన మీడియా ఛానల్లో వార్తలు వస్తున్నాయి. పోలీసులు దాడి చేసే.. పది నిమిషాల ముందే ఆ రాజకీయ నేత బయటికి వెళ్లిపోయారు. దీంతో అతడు బయటపడ్డట్లు చెబుతున్నారు. అయితే కొంతమంది కేటీఆర్ ను టార్గెట్ చేసి... ఇలాంటి వార్తలు రాయిస్తున్నారని.... కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నారు. ముఖ్యంగా అంశం ఏంటంటే...ఈ పార్టీలో కేటీఆర్, ఆయన బామ్మర్ది లేరని చెబుతున్నారు. మరి దీనిపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.