ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తాజాగా ఉద్యోగాల భర్తీని చేపడుతోంది. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా కూడా అమలు చేయడానికి మక్కువ చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు తాజాగా కూటమి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ ని తెలియజేస్తోంది. సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తన మొదటి సంతకం ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం చేయగా. ఆ మేరకు కసరత్తులు కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది ఇప్పుడు తాజాగా ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ కూడా ఖాళీల వివరాలను తెలియజేసింది.


మొత్తం మీద 18 విభాగాలలో ఏపీఎస్ఆర్టీసీలో 7,545 ఖాళీలను సైతం భర్తీ చేసేందుకు సిద్ధమయ్యింది. ఇందులో సుమారుగా 3,673 రెగ్యులర్ డ్రైవర్లను భర్తీ చేయబోతున్నట. అలాగే 1,813 కండక్టర్ పోస్టులను 579 అసిస్టెంట్ మెకానిక్, 656 జూనియర్ అసిస్టెంట్, 208 డిప్యూటీ సూపర్డెంట్, 179 మెకానిక్ సూపర్వైజర్, 2007 ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నట్లు ఆర్టిసి యాజమాన్యం ఇటీవలే తెలియజేసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లు తెలిపారు.


ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్ గా పనిచేసేందుకు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని.. అన్ని జిల్లాల వారీగా వివరాలను  ఇప్పటికీ ప్రకటించామంటూ తెలిపారు.. డీజిల్ మెకానిక్, వెల్డర్, పెయింటర్, మోటార్ మెకానిక్ ఇతర ట్రేడ్లలో జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను తెలియజేశారు ఇందుకోసం ఐటిఐ పూర్తి చేసిన వారందరూ కూడా అర్హులే అన్నట్లుగా తెలిపారు. అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎవరైనా అభ్యర్థులు ఎంపిక అయితే తీసుకుంటారని తెలిపారు. అయితే ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్, ఏజ్ ఇతరత్రా వాటిని త్వరలోనే అధికారికంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించబోతోంది. మరి ఏ మేరకు నిరుద్యోగులకు ఇది వరంగా మారనందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: