గత రోజులుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉంది.. అయితే ఈ విషయం పైన ఇటీవలే ఒక మీడియా జర్నలిస్ట్ ప్రశ్నించగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు మీకు కోపం అని ప్రశ్నించగా అందుకు ప్రకాష్ రాజ్ మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.


ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూర్ఖత్వపు విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని అది నచ్చడం లేదని తెలిపారు.. ప్రజలు ఆయనని ఎన్నుకున్నది ఇందుకోసం కాదు కదా అడిగే వారు ఎవరో ఒకరు ఉండాలి కదా అంటూ తెలియజేశారు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు కానీ గత కొద్దిరోజులుగా డిప్యూటీ సీఎం పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినీ లైఫ్ ని రాజకీయాలలోకి వాడుకుంటున్నారని కానీ ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే స్థాయిలో చాలా నిజాయితీగా వ్యవహరించలేదని ఆయన అభిప్రాయంగా తెలియజేస్తూ ఉంటారు ప్రకాష్ రాజ్.


తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న విషయాలపైన ఆయన ఫైర్ అయ్యారు.. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుడు గానే కాకుండా బాధ్యత వ్యక్తిగా నడుచుకుంటే మరి బాగుంటుందనే విధంగా ఆయన అభిప్రాయంగా తెలిపారు. ప్రజల కోసమే రాజకీయం పెట్టి వారి కోసమే రాజకీయాలలోకి వచ్చానని తెలిపిన పవన్ కళ్యాణ్ వారి సమస్యల పరిష్కారం కోసం ఏకాగ్రతతో పని చేయాలిసిన అవసరం ఉన్నదని కూడా తెలిపారు. కానీ ఆయన చేస్తోంది విధ్వంసక రాజకీయ పాలన అంటూ ఇవి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ తెలుపుతూ ఉన్నారు. పవన్ పై ప్రకాష్ రాజు చేసిన కామెంట్స్ ని సైతం అటు అభిమానులలో పార్టీ శ్రేణులను కాస్త నిరాశకు గురి చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: