వాటి వివరాలు మీడియాకు చెప్పాల్సిన పని లేదు..కావాలంటే షర్మిలనే అడగండి అంటూ క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. అదే సమయంలో షర్మిలమ్మ..వైఎస్ మరణానికి కారణమైన వాళ్లతో ఎలా కలుస్తావ్ ? అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నిలదీశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పీసీసీగా తన పని చేసుకోకుండా చంద్రబాబుతో షర్మిల లాలూచీ పడుతుందని ఆగ్రహించారు. చంద్రబాబుతో షర్మిల పని చేయకపోతే బాబుకు లేఖ ఎలా చేరుతుంది.. ఎవరిచ్చారని ప్రశ్నించారు.
జగన్ బెయిల్ రద్దు కావాలి.. జగన్ ను జైలుకు పంపాలనే కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. రాజకీయంగా జగన్ ను అంతం చేయాలనే బాబు చూస్తున్నాడని మండిపడ్డారు. ఇంకా జగన్ మళ్లీ అప్పుడు ముఖ్యమంత్రి కావద్దనే బాబు - షర్మిల ప్లాన్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.
జగన్.. షర్మిల పిల్లలిద్దరికీ సమాన ఆస్తి ఇవ్వాలని వైఎస్ చెప్పారని షర్మిల అంటున్నారని...ఎలక్షన్ అఫిడవిట్ లో ఆస్తుల పంపకాల గురించి జగన్ క్లియర్ గా చెప్పారని చురకలు అంటించారు. జగన్ స్వార్జితమైన ఆస్తుల్లో వాటా అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్ ఆస్తుల్లో వాటా ఆడుతున్నారు.. మీ ఆస్తుల్లో కూడా జగన్ కు వాటా ఉంటుంది కదా అంటూ నిప్పులు చెరిగారు. పెళ్ళైన 25ఏళ్ల తరువాత 200కోట్ల రూపాయల ఆస్తిని షర్మిలకు పిలిచి ఇచ్చాడు అంటూ జగన్ పై ప్రశంసించారు. జగన్ అతి మంచితనమే ఆయనకు అనర్థాలు తెచ్చి పెట్టిందని తెలిపారు.