వైసిపి పార్టీ నుంచి ఇటీవలే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలోకి చేరడంతో ఒక్కసారిగా ఒంగోలులో చిచ్చు రేపేల చేసింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో మరొక టిడిపి నేత అయినటువంటి శశికాంత్ రెచ్చిపోవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్లడంతో వెళ్లినా కూడా అతనిని వదలను అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అంతేకాకుండా బాలినేని జనసేన పార్టీలోకి వెళ్లడం పైన కూడా టిడిపి కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేరంటూ తెలియజేస్తున్నారు.


అంతేకాకుండా ఎవరిని అడిగి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని జనసేన పార్టీలోకి చేర్పించుకున్నారంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బాలినేని శ్రీనివాస పైన చాలా దుర్భాసలాడుతూ కూడా శశికాంత్ ఫైర్ అవుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. కూటమిగా ప్రభుత్వంలో కొనసాగుతున్నప్పుడు భాగస్వామ్య పార్టీల మనోభావాలను కూడా ప్రతి ఒక్కరూ గౌరవించాలంటూ ప్రశ్నిస్తున్నారు. కూటమికి కట్టుబడే తత్వం ఉండాలన్నది పవన్ కళ్యాణ్ గుర్తించుకోవాలంటు చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది.


బాలినేని శ్రీనివాస్ కు జనసేన కండువా వేయడంతో మా రక్తం మరిగిపోయిందని కూటమిలో ఉంటు కూడా తమని సంప్రదించకపోవడం చాలా దుర్మార్గమంటూ ఓడిపోయిన వాళ్లను చేర్చుకుంటే మేము కూడా మా దారిలోనే వెళ్లాల్సి ఉంటుంది అంటూ తెలియజేశారు.. శశికాంత్ భూషణ్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు జనసేన జిల్లా అధ్యక్షుడు సైతం ఖండించడం జరిగింది. బాలినేని చేర్చుకోవడంపై అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఇలా మాట్లాడడం శశికాంత్ సరైనది కాదు అంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తెలియజేశారు. కానీ బాలినేని శ్రీనివాస్ కార్యకర్తలు మాత్రం ఈ విషయం పైన కాస్త టీడీపీ నేతల మీద కోపంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి బాలినేని శ్రీనివాస్ ఈ విషయం మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: