ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా భిన్నంగా నడుస్తున్నాయి. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఆసక్తికరంగా ప్రస్తుత ఎన్నికలు కనిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ ఎవరికి లభిస్తుంది? ఎన్నిక ఎవరికి అనుకూలంగా ఉంటుందనే విషయాలు సర్వేల ద్వారా ఈజీగా తెలిసేది. ఈసారి మాత్రం ఇరువురు అభ్యర్థులు గెలిచే ఛాన్స్ లు 50-50గా కనిపిస్తున్నాయి. తుది ఫలితం అంచనాలకు అందని పరిస్థితి. రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ బరిలోకి దిగితే డెమొక్రాట్ పార్టీ నుంచి ప్రస్తుత దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ పోటీకి సై అన్నారు.

ట్రంప్ ఆల్రెడీ ఒకసారి అధ్యక్షడిగా పనిచేశారు. ఏ యుఎస్ అధ్యక్షుడైన కనీసం రెండు పర్యాయాలు పనిచేస్తారు. కానీ ట్రంప్ ను వెంటనే దించేశారు. అయితే ఇలాంటి అవమానకరమైన ఓటమిని చవిచూసినా సరే మళ్లీ ప్రెసిడెంట్ అవ్వాలని ఆశిస్తున్నారు. ఇక కమలా హారీస్ తొలిసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఆమె బలమైన పోటీనే ఇస్తున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఒకరికొకరు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరికీ ఒకే విధమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రంప్ పై కమలా గెలుస్తారా అనే సందేహం ఇప్పుడు ఎవరిలో లేదు ఆమె గెలవచ్చు అని చాలామంది భావిస్తున్నారు మరి కొంతమంది ట్రంప్ మళ్లీ ఈసారి విజయ బావుటా ఎగరవేస్తారని భావిస్తున్నారు.

ఈసారి యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ రిజల్ట్ నరాలు తెగే ఉత్కంఠ నడుమ వెలువడే అవకాశం ఉంది. పోలింగ్ తేదికి ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు చాలా సర్వేలు ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అన్ని సర్వీస్ అన్ని సర్వేలలో కమలా ట్రంప్ దాదాపు సమానమైన ఓటింగ్ పర్సంటేజ్ అందుకుంటున్నారు.

సీఎన్ఎన్ నిర్వహించిన తుది పోల్ లో ట్రంప్.. హారిస్ లకు ఇరువురికి 47 శాతం ఓట్లు వచ్చాయి. న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ చివరి పోల్‌లో ఇద్దరు అభ్యర్థులకు సమాన మద్దతు ఉందని, 48 శాతం మంది ఓటర్లు ఒక్కొక్కరికి మద్దతు ఇస్తున్నారని తేలింది.  ఫైనాన్షియల్ టైమ్స్, యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చేసిన మరో సర్వేలో 44 శాతం మంది ట్రంప్‌కు సపోర్ట్ ఇవ్వగా, 43 శాతం మంది హారిస్‌కు ఓట్లు వేస్తామని తెలిపారు. ఫైవ్ థర్టీఎయిట్ నుండి జరిపిన పోల్ వారి ట్రాకర్‌లో హారిస్ 1.7 శాతం ఆధిక్యంలో ఉన్నట్లు చూపించింది.

జార్జియా, మిచిగాన్, అరిజోనా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్, నెవాడా వంటి కీలక రాష్ట్రాలలో రేసు గట్టిగా ఉంది. హారిస్ తన చివరి ప్రచార ప్రయత్నాలలో మహిళలు, పిల్లల హక్కులపై దృష్టి సారిస్తుండగా, ట్రంప్ అక్రమ వలసలను లక్ష్యంగా చేసుకున్నారు. అతను దాని గురించి బలమైన ప్రకటనలు చేస్తున్నాడు, ఇతర దేశాలు తమ "చెత్త"ను U.S.కు పంపుతున్నాయని సూచిస్తున్నాయి.

టెక్సాస్‌తో సహా 14 రాష్ట్రాల్లో అబార్షన్ నిషేధించబడింది. హారిస్ ఈ నిషేధాలను రద్దు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి ఈ ఎన్నిక‌ల ప‌రిణామం చాలా ఉత్కంఠ రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: