జగన్, ఆయన కుటుంబ సభ్యులు 1122 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. వేమవరం - చెన్నాయపాలెం మధ్య సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ప్రస్తుతం జగన్ కు, జగన్ కుటుంబ సభ్యులకు మధ్య ఆస్తులకు సంబంధించిన వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రైతులు మాట్లాడుతూ భూ సేకరణ సమయంలో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
పరిశ్రమ నిర్మించుకునే ఆలోచన లేకపోతే రైతులకు భూములలో పంటలు పండించుకునే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రైతులు వాపోయారు. అప్పట్లో యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి భూములు తీసుకోవడం జరిగిందని రైతులు వెల్లడించడం గమనార్హం.
ఫ్యాక్టరీని నిర్మిస్తారా? లేక భూములను తిరిగిస్తారా? అని రైతులు ప్రశ్నించారు. అప్పట్లో ఎకరా 3 లక్షల రూపాయలకు ఇచ్చామని ఫ్యాక్టరీ నిర్మించకపోతే బహిరంగ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని రైతులు కోరారు. సరస్వతీ పవర్ పై ఏసీబీ, సీఐడీ విచారణకు ఆదేశించాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. ఈ వివాదం విషయంలో జగన్ కు జైలుకు పంపాలని ఆయన కోరారు. రైతుల తిరుగుబాటు నేపథ్యంలో ఈ వివాదం విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో జగన్ ను ఇబ్బంది పెట్టే ఏ అవకాశాన్ని వదులుకోదు.