విజయమ్మ మౌన వ్రతం విషయంలో జగన్ సొంత పత్రిక ఆగ్రహం పాటించడం కరెక్టేనని వైఎస్సార్ అభిమానులు చెబుతున్నారు. ఎన్నో అనుమానాలకు తావిచ్చే విధంగా షర్మిల తీరు ఉందనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి. షర్మిల కుట్రలో విజయమ్మ ఆమెకు తెలియకుండానే భాగస్వామి అయ్యారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. విజయమ్మ తటస్థ వైఖరి వల్ల జగన్ తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు.
విజయమ్మ జగన్ బెయిల్ రద్దయ్యే విధంగా వ్యవహరించడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయమ్మ కూతురుపై ప్రేమతో కొడుకు విషయంలో తప్పు చేస్తున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే అమ్మను టార్గెట్ చేస్తూ జగన్ పత్రికలో కథనాలు రావడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పై కొంత వ్యతిరేకత పెరిగే ఛాన్స్ కూడా ఉంది.
విజయమ్మ ఎందుకు ఈ విధంగా చేసి కొత్త వివాదాలను క్రియేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ పొలిటికల్ కెరీర్ ను విజయమ్మ, షర్మిల నాశనం చేస్తున్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. జగన్ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వ్యక్తుల విషయంలో ఒకింత సీరియస్ గా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సాక్షి పత్రిక రాబోయే రోజుల్లో విజయమ్మకు షాకిచ్చే విధంగా మరిన్ని కథనాలను ప్రచారంలోకి తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంలో ఎన్ని మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.