ఆంధ్రప్రదేశ్లో టిడిపి, వైసిపి నేతల మధ్య మాటలు యుద్ధమైతే గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉన్నది. ముఖ్యంగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరొకసారి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను సైతం పక్కనపెట్టి మరి.. కేవలం గత పాలన పైన విమర్శించడమే పనిగా పెట్టుకుంది అంటూ ఫైర్ అయ్యారు.


ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచాలన్న ప్రతిపాదన పైన కూడా మాజీ సీఎం జగన్ సెటైర్లు వేయడం జరిగింది.. ప్రజలకు దీపావళి కానుకగా కరెంటు చార్జీలు పెంచడమే సీఎం చంద్రబాబు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.అధికారంలో వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు భారీ స్థాయిలో పెంచడమే చంద్రబాబు నైజాం అంటూ తెలియజేశారు. ఈ విషయంపై ప్రజలతోపాటు వైసీపీ నేతలు కూడా ఫైర్ అవుతూ ఉన్నారు.. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచామంటూ చంద్రబాబు ఎన్నో రకాల సభలలో తెలియజేశారు.


కానీ ఇప్పుడు గత ప్రభుత్వం మీద నిందలు వేస్తూ విద్యుత్ చార్జీలు పెంచడంతో మళ్ళీ తప్పు చేస్తున్నారనే విధంగా ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మహిళలు సైతం తమకు చెప్పిన హామీలను అమలు చేయకపోవడంతో చాలా కోపంగా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే విద్యుత్ ఛార్జీలు పెంచితే కచ్చితంగా ధర్నాలు చేస్తామనే విధంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికే వంట ధరలు సైతం ఆకాశానికి అందుతున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ కరెంట్ చార్జీలు పెంచడం అంటే ఇది సామాన్యుల మీద గుదిబండ లాగా మారుతోంది అంటూ తెలియజేశారు. వాలంటరీ వ్యవస్థ కూడా పూర్తిగా రద్దు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. నిరుద్యోగులు కూడా ఉద్యోగాల కోసం చాలా  ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాగే కొత్త పింఛనీల కోసం కూడా పింఛనిదారులు ఎదురుచూస్తున్నారు. ఇవే కాకుండా ప్రజలు మరిన్ని పథకాల అమలు కోసం ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: