మాజీ సీఎం వైఎస్ జగన్ కు అధికారం కోల్పోయిన రోజు నుంచి కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాజకీయాలలో హత్యలు ఉండవని అత్మహత్యలు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఈ విషయాలు చెప్పడానికి జగన్ జీవితమే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట తెలుగుదేశం కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
 
తల్లి, చెల్లిపై కేసు వేయడం వల్ల జగన్ పూర్తిగా పాతాళానికి కూరుకుపోయాడని జగన్ చేయి పట్టుకున్నవాళ్లంతా పాతాళంలోకే అని ఆయన తెలిపారు. ఇది రాజకీయ ఆత్మహత్యే అని ఆయన కామెంట్లు చేశారు. కుటుంబ తగాదాలను రోడ్డుకీడ్చి మీడియాపై బురద జల్లడం హాస్యాస్పదం అని ఆయన చెప్పుకొచ్చారు. షర్మిలకు జగన్ ఇచ్చిన 200 కోట్ల రూపాయలు ఎక్కడివని ఆయన ప్రశ్నించడం గమనార్హం.
 
జగన్ కామెంట్లపై ఐటీ, ఈడీ ఎందుకు స్పందించడం లేదని క్విడ్ ప్రొ కో కేసులు అన్నీ కొలిక్కి తీసుకొనిరావాలని ఆర్థిక నేరస్తుడు అయిన జగన్ 11 సంవత్సరాలుగా బెయిల్ పై ఉండడమేంటని యనమల ప్రశ్నించారు. జగన్ న్యాయ వ్యవస్థకే కొరుకుడు పడని కొయ్యగా మారారని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ సగం మునిగిపోయిన నావ అని పూర్తిగా మునిగిపోకముందే అందరూ దూకేయడం మంచిదని ఆయన తెలిపారు.
 
జగన్ చిన్నమ్మ సౌభాగ్యమ్మ, చెల్లి సునీత ఉసురు పోసుకున్నాడని వాళ్ల కన్నీళ్లే వైసీపీకి శాపమని తెలిపారు. జగన్ ఇప్పుడు తల్లిని, చెల్లిని కూడా ఏడిపిస్తున్నాడని యనమల వెల్లడించారు. యనమల ప్రశ్నలు నెటిజన్లకు సైతం ఎన్నో సందేహాలను కలిగిస్తున్నాయి. ఈ కామెంట్ల గురించి వైసీపీ నేతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలని ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సైతం కుటుంబ తగాదాలను పెద్దవి చేసుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ లో మార్పు రాకపోతే మాత్రం ఫలితం ఉండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: