వైయస్ జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ.. వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్... సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షి మీడియాలో కూడా వైయస్ షర్మిల కు హక్కులు ఉన్నాయని ఆయన... బాంబు పేల్చారు. కానీ.. ఆ సంస్థను జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నారని తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు బ్రదర్ అనిల్. ఇప్పటికైనా సాక్షి ఛానల్ ను షర్మిలకు ఇవ్వచ్చు కదా అంటూ... కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు బ్రదర్ అనిల్.
వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు... పార్టీకి సంబంధించిన ఒక్క ప్రకటన కూడా సాక్షిలో వేయలేదని ఆగ్రహించారు. డబ్బులు ఇచ్చి.. ప్రకటన వేయించుకుంటామన్న కూడా... జగన్మోహన్ రెడ్డి... అడ్డుకున్నాడన్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని విజయమ్మ అడిగినా కూడా.. సాక్షిలో ప్రకటనకు ప్లేస్ ఇవ్వలేదని..బాంబు పేల్చారు. అలాగే... తెలంగాణలో వైసీపీ పార్టీని క్లోజ్ చేయడం పై కూడా... బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నాడని... ఆయన ఉంటే వైసీపీకి ఇబ్బంది అవుతుందని జగన్మోహన్ రెడ్డి తమతో చెప్పినట్లు... బ్రదర్ అనిల్ వెల్లడించారు. తన ఆస్తులు తెలంగాణలో ఉండడం వల్ల... వైసిపి పార్టీ క్లోజ్ చేయాల్సి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి... తమతో అన్నట్లు బ్రదర్ అనిల్ తాజాగా పేర్కొన్నారు. దాంతో... తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టాలని షర్మిలను ప్రశాంత్ కిషోర్ కోరాడన్నారు. అందుకే తెలంగాణలో పార్టీ పెట్టాల్సి వచ్చిందని తెలిపారు.