ఈడీ జప్తులో ఆస్తుల్ని పంపిణీ చేసుకున్నారన్న ఆరోపణలతో జగన్ బెయిల్ రద్దు చేయాలన్న కుట్రతోనే షర్మిళ ఇలా చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సరస్వతి షేర్లు ఈడీ అటాచ్‌లో ఉన్నాయని నిరూపించాలని షర్మిల చేసిన సవాల్‌కు వైసీపీ నుంచి స్పందన లేదు.
వారు చెప్పాలనుకున్నది చెబుతున్నారు. కానీ జగన్ బెయిల్ రద్దు పిటిషన్లు మాత్రం దాఖలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. సరస్వతి పవర్ షేర్లు మాత్రమే కాదు మొత్తం బెయిల్ రూల్స్ ఉల్లంఘనలపై ఈ పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. అక్రమాస్తుల కేసుల్లో జగన్ కు బెయిల్ ఇచ్చినప్పుడు అనేక షరతులు పెట్టారు. వాటిలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు.
జగన్ సీఎంగా ఉన్నంత కాలం దర్యాప్తు సంస్థలు ఈ ఉల్లంఘనల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు పదవి పోయింది. దీంతో ఆయనపై మళ్లీ ఫోకస్ పెట్టినట్లు అర్థం అవుతుంది. సహ నిందితులకు అక్రమంగా లబ్ది చేకూర్చడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసేందుకు ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు వెళ్లాయని తెలుస్తోంది.
వాటి ఆధారంగా ఆయన బెయిల్ రద్దు పిటిషన్ వేయాలని దర్యాప్తు సంస్థలకు విజ్ఞప్తులు వెళ్తున్నాయి. బెయిల్ వచ్చిన చాలా కాలం తర్వాత బెయిల్ రద్దు చేయాలని దర్యాప్తు సంస్థలు కోర్టులకు వెళ్లడం అరుదు. కానీ ఇతర నేరాల్లో భాగం అయ్యారని.. ఆయనలో మార్పు రాలేదని కోర్టుకు చెబితే మాత్రం వెళ్లవచ్చు. జగన్ విషయంలో అలాంటి అరుదైన నిర్ణయం దర్యాప్తు సంస్థలు తీసుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
దర్యాప్తు సంస్థలు కాకపోతే వ్యక్తులు అయినా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. గతంలో రఘురామరాజు పిటిషన్ వేశారు. ఇవి కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. వచ్చే ఆరు నెలల్లో జగన్ బెయిల్ రద్దు పిటిషన్లు కోర్టుల్లో దాఖలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.