వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీలో ఉన్న ఇద్దరు మేడంలు ఇప్పుడు బాగా టెన్షన్ పెట్టేస్తున్నారట. ఆ ఇద్దరు కూడా రాజధాని ప్రాంతంలో కీలక జిల్లా అయిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వారే కావటం విశేషం. జగన్ గుంటూరులో ఎప్పుడు పర్యటించిన మాజీ మంత్రి విడుదల రజని పక్కనే ఉంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్.. రజినీకి కీలకమైన వైద్య.. ఆరోగ్య శాఖ మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. పైగా గత ఎన్నికలకు ముందు చిలకలూరిపేటలో ఆమె ఓడిపోతారని భావించి ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మర్చిన ఏకంగా 53,000 ఓట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయారు.


ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కొద్ది రోజులు పాటు జగన్ పక్కనే కనిపిస్తూ హడావుడి చేసిన రజిని.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తాజాగా వైసిపిలో అధికార ప్రతినిధిగా వచ్చి హైలైట్ అవుతున్న యాంకర్ శ్యామల జోరు ముందు ప్రజలు పూర్తిగా బేజారు అయిపోతున్నారు. ఇక రజనీ వైసీపీకి రాజీనామా చేస్తారని.. ఆమె జనసేన కండువా క‌ప్పుకుంటారని ప్రచారం జరుగుతుంది. రజిని భర్త కుమారస్వామిది కాపు సామాజిక‌వ‌ర్గం. తన భర్త ద్వారా పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు.. అలాగే ఇటీవల వైసీపీని వీడి జనసేనలోకి వెళ్లిన మాజీ మంత్రి బలినేని శ్రీనివాస్ రెడ్డి ద్వారా పవన్ చెంత చేరేందుకు రజిని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.


ఇక మరో మాజీ మహిళా మంత్రి.. గతంలో వైసీపీ ప్రభుత్వం లో హోంశాఖ మంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరిత కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఆమెను జగన్ ఎన్నికలకు ముందు ఆమె కోరుకున్న ప్రతిపాడు కాదని.. తాడికొండకు బలవంతంగా మార్చగా ఆమె ఓడిపోయారు. ఇప్పుడు సుచరిత‌ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేనలో ఎంట్రికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గత వైసీపీ ప్రభుత్వం లో ఉమ్మడి గుంటూరు జిల్లాల మంత్రులుగా చ‌క్రం తిప్పిన ఇద్దరు మేడంలు ఇప్పుడు జగన్‌ను బాగా టెన్షన్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: