కానీ మధ్యాహ్నం వరకు ఈ కేసు కాస్త చల్లబడింది. అది డ్రగ్స్ పార్టీ...కాదని... కేవలంమందు పార్టీ అని తేలిపోయింది. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా తేల్చి చెప్పారు. డ్రగ్స్ కు సంబంధించిన అవశేషాలు... కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ లో దొరకలేదని అధికారులు కూడా తేల్చి చెప్పారు. ఫారెన్ లిక్కర్... దొరకడం జరిగిందని వివరించారు. దీంతో గులాబీ పార్టీ... కాంగ్రెస్ ప్రభుత్వం పైన కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది.
ఇంట్లో పార్టీలు కూడా చేసుకోవద్దు ఆ? పార్టీలు చేసుకుంటే దౌర్జన్యాలు చేస్తారా? అంటూ నిప్పులు జరిగింది గులాబీ పార్టీ. కేటీఆర్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోయారు. తీన్మార్ మల్లన్న... కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ బామ్మర్ది పార్టీ పైన... తీన్మార్ మల్లన్న స్పందించడం జరిగింది. లోకల్ బాడీ ఎన్నికలు వస్తుందని నేపథ్యంలో గులాబీ పార్టీపై అక్రమంగా కేసులు వేయకూడదని సూచించారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీలో... ఎన్నికల కంటే ముందు అలాంటి తప్పులను చేసి... ఇప్పుడు ఓడిపోయాడని గుర్తు చేశారు.
వాస్తవంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడును అరెస్టు చేయకపోతే జగన్ పరిస్థితి వేరే లాగా ఉండేది. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి... అనవసరంగా ఆయనను హీరో చేశారు జగన్. అయితే ఇప్పుడు తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్ లాంటి నేతలపై అక్రమంగా కేసులు పెడితే... రేవంత్ రెడ్డికి కూడా అలాంటి గతే పడుతుందని తీన్మార్ మల్లన్న చెప్పగానే చెప్పారు.