ముఖ్యంగా తన కుటుంబం గురించి ఎవరికి తోచిన విధంగా రాసేస్తూ మాట్లాడేస్తూ ఉన్నారని విజయమ్మ తెలిపారు. ఈ విషయాలు తన పిల్లలకే కాదు రాష్ట్రానికి కూడా మంచిది కాదని తెలిపారు. రాకూడదనుకున్నాను కానీ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ తెలిపింది విజయమ్మ.. తమ కుటుంబం పైన తప్పుగా మాట్లాడే వారందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నానని తమ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరే మా జీవితంలో మీరందరూ కూడా ఒక భాగమే అంటూ తెలిపింది.ఇది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అంటూ విజయమ్మ తెలిపింది. ఆయనను మీరు ఎలా ప్రేమించారు మిమ్మల్ని కూడా ఆయన అలాగే ప్రేమించారని తెలిపింది.
రాజశేఖర్ రెడ్డి గారు తమ మధ్య లేకపోయినా కూడా తమ పిల్లలను ఆయనలో చూసుకుంటూ ఉన్నారని తెలిపింది విజయమ్మ. ఈ విషయం తాను ఎప్పటికీ మర్చిపోలేనని కూడా తెలిపింది.ఎవరు కూడా తన కుటుంబాన్ని పిల్లలని తక్కువ చేసి మాట్లాడొద్దండి అంటూ కోరుకుంటుంది. సోషల్ మీడియాలో ఎవరూ కూడా కల్పిత వార్తలు దుష్ప్రచారాలు చేయవద్దండి అంటూ తెలిపింది.
ఇక ఆస్తులు విషయానికి వస్తే వైఎస్ఆర్ బతికి ఉండగానే ఆస్తులు పని చేశారన్నది నిజం కాదు వైఎస్సార్ పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజులలోనే కొన్ని ఆస్తులు అటు కొడుకు మీద పాప పేరు మీద పెట్టారని అది ఆస్తులు పంచడం కాదని తెలిపింది.. వైయస్సార్ చేసింది పంపకం కాదని కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేర్లు మీద పెట్టారని తెలిపింది. అంతేకాకుండా విజయసాయిరెడ్డి ఆడిటర్ గా ఉన్నారు. అలాగే వైవి సుబ్బారెడ్డి ఇంటి బంధువు కాబట్టి సాక్ష్స సంతకం పెట్టారని.. తెలిపింది.
అయినా కూడా మీడియాలో ఆ వాస్తవాలు చెప్పడం చాలా బాధ కలిగించింది అంటూ తెలిపింది విజయమ్మ. తల్లిగా తనకు ఇద్దరు పిల్లలు సమానమేనని అలాగే ఈ మాట రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్నోసార్లు చెప్పారని తెలిపింది. అలాగే ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అన్నది కూడా నిజమే అని తెలిపింది. తన నలుగురు బిడ్డలకు సమానంగా ఉంచాలన్నదే వైయస్సార్ కల అంటూ తెలిపింది విజయమ్మ.. ఆస్తులను అభివృద్ధి చేయడంలో జగన్ కష్టం ఉందని కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులు అన్నది నిజమని తెలిపింది.. జగన్ కొడుకుగా కుటుంబ ఆస్తులను రక్షించడంలో ఉన్నది కూడా నిజమేనని.. వైయస్సార్ చివరి రోజుల్లో కూడా..తన తండ్రికి ఒక మాట ఇచ్చారు నాన్న నీ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరుకునేది నేనే అంటూ తెలిపారు. ఇవే కాకుండా విజయమ్మ ఇంకా చాలా విషయాలను రాసింది.