ప్రస్తుత కాలంలో బంగారం కొనుగోలు చేయాలనే ఆసక్తి చాలామందిలో పెరుగుతోంది. బంగారంపై పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. ధన త్రయోదశి రోజున కేవలం 10 రూపాయలకే బంగారం కొనే అవకాశాన్ని ముఖేష్ అంబానీ కల్పించడం గమనార్హం. జియో ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ తాజాగా స్మార్ట్ గోల్డ్ స్కీమ్ ను మొదలుపెట్టింది.
 
కేవలం 10 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టే అవకాశం వల్ల పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ఎప్పుడైనా బంగారంగా మార్చుకోవచ్చు. అరగ్రామ్ నుంచి 10 గ్రాముల వరకు ఈ యాప్ ద్వారా ఫిజికల్ గోల్డ్ ను కొనుగోలు చేయవచ్చు. హోమ్ డెలివరీ సదుపాయం ఉండటంతో ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు.
 
ఈ స్కీమ్ ద్వారా 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. యాప్ సహాయంతో బంగారం ధరను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. బంగారం ప్రియులకు ఇది నిజంగా బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ధన త్రయోదశి రోజున ముఖేశ్ అంబానీ ఈ స్కీమ్ ను మొదలుపెట్టడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇంత తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఎక్కడా ఉండదు.
 
బంగారంకు సంబంధించి ఈ యాప్ లో రాబోయే రోజుల్లో మరిన్ని బెనిఫిట్స్ అందిస్తారేమో చూడాల్సి ఉంది. ధన్ తేరస్ రోజున బంగారం కొనుగోలు చేయడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయని కోటీశ్వరులు అవుతారని చాలామంది ఫీలవుతారు. గోల్డ్ కొనుగోలు చేయడం ఒక విధంగా భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టినట్టు అవుతుందని చెప్పవచ్చు. దీపావళి పండుగ సమయంలో గోల్డ్ పై చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అదిరిపోయే ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బంగారం కొనుగోలుకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: