రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విజయమ్మ రాసిన లేఖ సంచలనం అవుతోంది. తెలుగుదేశం పార్టీ సైతం విజయమ్మ రాసిన లేఖను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ఆస్తుల్లో షర్మిల వాటా అడుగుతుండగా షర్మిల ఆస్తుల్లో జగన్ కు వాటా ఇస్తారా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.
 
జగన్ కష్టం మాటేంటని జగన్ ఆస్తుల్లో వాటా అడుగుతున్న షర్మిల జగన్ జైలుశిక్షలో వాటా ఎందుకు అడగటం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆస్తుల్లో వాటాలు పంచుకోవాలని అనుకుంటే 15 సంవత్సరాల క్రితం ఎందుకు పంచుకోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయమ్మ షర్మిలపై ప్రేమతో జగన్ కు అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్ ఫ్యామిలీకి నష్టం చేకూరుస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
2019లో ఎంఓయూ రాసుకున్న తర్వాత ఇంకా ఆస్తుల్లో వివాదం ఏంటనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. షర్మిల వైసీపీ, జగన్ కు చేయాల్సిన నష్టం అంతా చేసేసి ఇప్పుడు ఆస్తుల్లో వాటా అడగటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విజయమ్మ రాసిన లేఖ అందరూ ఊహించిన విధంగానే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
కుటుంబంలో విబేధాలు ఉంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలే తప్ప రచ్చకీడ్చి నిందించడం న్యాయం కాదనే చర్చ సైతం జరుగుతోంది. విజయమ్మ లేఖపై వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉండనుందో చూడాలి. విజయమ్మ, షర్మిల జగన్ పొలిటికల్ కెరీర్ నాశనం చేసే విధంగా అడుగులు వేయడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విజయమ్మ లేఖ విషయంలో జగన్ సొంత పత్రిక తీరు ఏ విధంగా ఉంటుందనే చర్చ సైతం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం నెట్టింట సంచలనం అయింది.




 


మరింత సమాచారం తెలుసుకోండి: