జగన్ కు కోర్టులో మాత్రమే న్యాయం జరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్ని కుటుంబాలలో ఆస్తుల పంపకాలు వేరని వైఎస్సార్ కుటుంబంలో చోటు చేసుకున్న ఘటనలు వేరని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఆస్తుల కోసం రచ్చకెక్కి షర్మిల సాధించేది ఏంటనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ షర్మిల విబేధాలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని ఈ విశయంలో ఎలాంటి సందేహాలు అయితే అవసరం లేదని తెలుస్తోంది.
విజయమ్మ చెప్పిన లాజిక్స్ కోర్టులో వర్కౌట్ అయ్యే లాజిక్స్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. షర్మిలకు విజయమ్మ లేఖ మేలు చేయొచ్చేమో కానీ జగన్ అభిమానుల నుంచి షర్మిలకు అణువంతైనా సపోర్ట్ లభించదు. మరో నాలుగేళ్లు గడిస్తే ఆ సమయంలో షర్మిల కామెంట్లను పట్టించుకునే వాళ్లు కూడా ఉండరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
జగన్ కు ప్రజల్లో 40 శాతం ఓటు బ్యాంక్ ఉంది. సూపర్ సిక్స్ హామీల అమలుకు సంబంధించి కొన్ని షరతులను అమలు చేయడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ అమలు చేసిన కొన్ని నిబంధనలనే చంద్రబాబు సైతం అమలు చేస్తుండటంతో అర్హత ఉన్నా చాలామంది పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. గ్యాస్ సిలిండర్ అమలుకు సంబంధించి తెల్ల రేషన్ కార్డ్ తో పాటు మరికొన్ని నిబంధనలు అమలవుతూ ఉండటంతో కొంతమంది అర్హత ఉన్నా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం. విజయమ్మ రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.