గతంలో గడపగడపకు మన ప్రభుత్వం అంటూ వైసీపీ హయాంలో కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తర్వాత సిద్ధం సభలను కూడా నిర్వహించారు. ఇక మా నమ్మకం నువ్వే జగన్ అంటూ.. ఇంటింటికీ పోస్టర్లు అంటించారు.  అదేవిధంగా 'నువ్వే కావాలి' పేరుతోనూ ప్రత్యేకంగా క్యాంపెయిన్లు నిర్వహించారు. ఇలా.. వైసీపీ హయాంలో ప్రత్యేకమైన స్లోగన్లను ప్రజలకు పరిచయం చేశారు. అయితే.. ఇవన్నీ.. గతం. ఇప్పుడు మాటేంటి? అనేది ప్రశ్న.


ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్టీ భారీగా గెలుస్తుందని ఆశించినా.. ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఆత్మ పరిశీలన చేసుకున్న వైసీపీ.. తప్పులు తెలుసుకుంది. ప్రజలకు చేరువ అయ్యే క్రమంలో మితిమీ రిన అత్యుత్సాహం. నమ్మకం సరికాదన్న భావన అయితే.. పార్టీలో కనిపించింది. దీంతో ఇప్పుడు ఆ తప్పులు సరిచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ప్రజలకు కనెక్ట్ అయ్యేలా.. కార్యాచరణకు రెడీ అయింది.


త్వరలోనే జగన్ సహా పార్టీ నాయకులు.. ప్రజల మధ్యకు రానున్నారు. వచ్చే సంక్రాంతి తర్వాత నుంచి ప్రజల మధ్యకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీని ప్రజలకు కనెక్ట్ చేసేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. అదేవిధంగా అధిరిపోయే స్లోగన్ల కోసం కూడా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం.. వైసీపీకి రాజకీయ వ్యూహకర్త అంటూ ఎవరూ లేరు. ఐప్యాక్ టీం ఎన్నికల తర్వాతే వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీకి మేధో సాయం చేసే వారు కావాలి.


అదేసమయంలో మంచి మంచి స్లోగన్లు ఇచ్చే వారు కూడా కావాలి. అందుకే.. వైసీపీ నాయకులు ఇప్పుడు స్లోగన్లు ఇచ్చేవారి కోసం ఎదురు చూస్తున్నారు ఎవరికి వారు ఇండివిడ్యుయల్‌గా కూడా.. తమను ప్రజల కు కనెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వారు కూడా.. బలమైన స్లోగన్, కార్యాచరణ వంటివాటి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఇది.. పార్టీ అంతర్గత అంశంగానే ఉంది. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో టీడీపీ కూడా.. తెలుగు తమ్ముళ్లు స్లోగన్లు ఇవ్వాలంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: