రష్యా - ఉక్రెయిన్ యుద్ధం గురించి ఇపుడు చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. గత రెండేళ్లుగా యుద్ధం చేస్తోన్న ఈ దేశాలకు అలుపే రాలేదా అంటూ అనేక కధనాలు వెలువడుతున్న వేళ అప్పుడప్పుడు ఏదోఒక విషయం బయటకి వస్తూ ఉంది. అవును, ఉక్రెయిన్‌ను నాశనం చేసి తీరుతామని రష్యా మొండి పట్టు పట్టుకు కూర్చున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ కూడా ఏం తక్కువ తినలేదు. తాజా విషయం ఏమిటంటే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అణు దళాల కసరత్తులను ప్రారంభించాలని ఆదేశించడంతో ఇప్పుడు ఈ యుద్ధం విషయంలో అంతిమ ఘట్టం రాబోతోదని గుసగుసలు వినబడుతున్నాయి.

పుతిన్ ఇలా సైనిక విన్యాసాలు ప్రారంభించడం 2 వారాల్లో ఇది రెండోసారి కావడంతో ఉక్రెయిన్ వెన్నులో వణుకు పుడుతోందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉద్రిక్తతను ఎలా ఎదుర్కోవాలో పాశ్చాత్య నేతృత్వంలోని నాటో కూటమికి ఇంకా సందేహంగానే ఉంది. రష్యాలోని లోతైన లక్ష్యాలను ఛేదించగల సుదూర శ్రేణి క్రూయిజ్ క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించాలని యుఎస్‌తో సహా పాశ్చాత్య దేశాలు ప్లాన్ చేయడంతో ఉద్రిక్తతలు పెరిగినట్టు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. పాశ్చాత్య మద్దతుతో ఉక్రెయిన్ అలాంటి చర్య తీసుకుంటే, తనను తాను రక్షించుకోవడానికి అణ్వాయుధాలను ఉపయోగించడాన్ని పరిశీలిస్తుందని రష్యా పశ్చిమ దేశాలను స్పష్టంగా హెచ్చరించింది.

అయితే, న్యూక్లియర్ డ్రిల్స్‌ ప్రారంభించిన పుతిన్ మాత్రం, "బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల అవసరమైన వినియోగంతో సహా అణ్వాయుధాల వినియోగాన్ని నియంత్రించడానికి మేము ప్రాక్టీస్ చేస్తాము. వీటిని మేము అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే వాడుతామని, వాటిని ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు." ఆయన ఎలా మాట్లాడినప్పటికీ, ఉక్రెయిన్ ని ఒళ్లుదగ్గర పెట్టుకొని ఉండకపోతే ఇక అంతే! అని చెప్పకనే చెప్పేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఉక్రెయిన్‌లో పోరాడేందుకు ఉత్తర కొరియా రష్యా సైన్యాన్ని పంపడంతోపాటు రష్యాపై నాటో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: