మాజీ మంత్రి జోగి రమేష్‌ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలా టార్గెట్ చేసిందో చూసాం. జోగి రమేష్ కుమారుడిని అరెస్టు చేయటంతో.. జోగి రమేష్ ఒక బీసీ నేతను టార్గెట్ చేస్తున్నారు అని కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేయడం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం జోగి రమేష్ పక్కచూపులు చూస్తున్నారని.. వైసీపీకి గుడ్ బై చెప్పేసి టిడిపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జోగి రమేష్ ను చేర్చుకునే విషయంలో టిడిపి తటపట ఇస్తున్నట్టు సమాచారం.
జోగి రమేష్ టిడిపి చేరికను కొందరు టిడిపి నాయకులు అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ క్యాస్ట్ లు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారు. అయితే లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు.. అలాగే అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి అమ్మటం కారణంగా జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అలాంటి నేతను ఇప్పుడు పార్టీలోకి ఎలా తీసుకుంటారని టిడిపి నేతలు వాపోతున్నారు.
కృష్ణా జిల్లాలో కొందరు నేతలు మాత్రం జోగి రమేష్ టిడిపిలో చేరటాన్ని ఎంత మాత్రం సహించడం లేదు. దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్, కాగితపు కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ టిడిపిలో చేరటాన్ని ఇష్టపడటం లేదు. అయితే కొందరు బీసీ నేతలు మాత్రం జోగి రమేష్ కు బీసీ నేతగా మంచి గుర్తింపు ఉందని.. జోగి రమేష్ వల్ల రాజకీయంగా ఉపయోగం ఏం ఉంటుందని.. జోగి రమేష్ ను పార్టీలో చేర్చుకుంటే వైసీపీ మరింత బలహీనం పడుతుందని చంద్రబాబుకు వర్ణిస్తున్నారట. మరి జోగి రమేష్ ను చంద్రబాబు, లోకేష్ టిడిపిలో చేర్చుకుంటే అంతకన్నా నీచ రాజకీయం ఉండదనే చెప్పాలి.