- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )  . .

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్యే సీటు రావటం అంటే మామూలు విషయం కాదు. ప్రధాన పార్టీల నుంచి ఎమ్మెల్యే సీటు దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే.. ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనటం మరో ఎత్తు. జీవితంలో ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అనిపించుకోవడం కోసం అసెంబ్లీలో అడుగు పెట్టడం కోసం సంవత్సరాలపాటు రాజకీయాల చేస్తూ కెరీర్‌ను త్యాగం చేసే నాయకులు ఎంతో మంది ఉంటారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.


అయితే రాష్ట్రంలో పునర్విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 175 గా ఉన్న అసెంబ్లీ సీట్లను 225 కు.. తెలంగాణలో 119 నుంచి 153 సీట్లకు పెంచుతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే అది జరగలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2019, 2024 రెండు సార్లు ఎన్నికలు జరిగినా పాత సీట్ల ప్రకారం ఎన్నికలు జరిగాయి. అయితే త్వరలోనే జనాభా లెక్కలు జరుగుతున్నాయి. 2021 లో జరగాల్సిన జనాభా గణ‌న.. కరోనా కారణంగా చేపట్టలేదు.


2025లో జనాభా లెక్కలు మొదలుకానున్నాయి. ఆ తర్వాత 2026 లో నియోజకవర్గాల పునర్విభ‌జ‌న జరుగుతుంది. ఈ జనాభా లెక్కల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభ‌జ‌న‌ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న 175 మంది ఎమ్మెల్యేలకు తోడు.. కొత్తగా మరో 50 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టమన్నారు. అంటే అదనంగా 50 సీట్లు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పుడు ఉన్న 119 సీట్లు.. ఏపి153 సీట్లు కానున్నాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి ఇన్ని అసెంబ్లీ సీట్లు పెరిగి.. ఇంతమందికి ఎమ్మెల్యేలు ఎన్నిక అయ్యే అవకాశం రావడం అంటే మంచి లక్కీ ఛాన్స్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: