నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నారు. తాను నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఇక కరోనా సమయంలో విడుదలైన అఖండ, సంక్రాంతి సమయంలో విడుదలైన వీరసింహారెడ్డి, గత సంవత్సరం విడుదలైన భగవంత్ కేసరి వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ మూడు సినిమాలతో బాలయ్య బాబు వరుసగా హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఎన్బీకె 109 సినిమా చేస్తున్నారు. ఇందులో డాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌతేలా, శ్రద్ధ శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు.
ఇదిలా ఉండగా.... ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ కు కాస్త కోపం ఎక్కువ అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ కొద్దిరోజుల క్రితం షూటింగ్ కోసం రాజమండ్రికి వెళ్లారట. అక్కడికి కోటా శ్రీనివాస్ కూడా వేరే సినిమా షూటింగ్ కోసం అదే ప్లేస్ కి వెళ్లారట.
అక్కడ షూటింగ్ సమయంలో బాలకృష్ణను కలిసినప్పుడు కోటా శ్రీనివాసరావు నమస్కారం పెడితే కోపంతో ముఖంపై ఉమ్మేసి బాలకృష్ణ వెళ్లాడని శ్రీనివాసరావు చెబుతూ బాధపడ్డాడు. ఈ సంఘటన కొన్ని రోజుల క్రితమే జరిగిందని వెల్లడించాడు. రాజమండ్రికి షూటింగ్ కోసం వెళ్లగా అక్కడ వేరే షూటింగ్ కి బాలకృష్ణ కూడా వచ్చారట. ఇద్దరు ఒకే చోట బస చేయగా ఆయన లిఫ్ట్ లో పైనుంచి కిందకు వస్తున్నాడట. తాను కింద నుంచి పైకి వెళ్లేందుకు లిఫ్ట్ కోసం అక్కడ నిలబడ్డాడట.
ఇక అక్కడ ఉన్న వారందరూ తప్పుకోండి అంటున్నప్పటికీ ఎందుకో తనకు అర్థం కాలేదని వెల్లడించాడు. అయితే ఆ లిఫ్ట్ లో నుంచి బాలకృష్ణ దిగుతుండగా అతనిని చూసి నమస్కారం పెట్టాను. అంతలోనే కోపంతో బాలకృష్ణ నా ముఖం మీద ఉమ్ము వేశాడని కోటా శ్రీనివాస్ చెబుతూ బాధపడ్డాడు. ఈ విషయాన్ని తాజాగా కోటా శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ విషయం తెలిసిన చాలామంది అంత పెద్ద వ్యక్తి నమస్కారం పెడితే సంస్కారం లేకుండా బాలకృష్ణ అలా ఉమ్మేసి వెళ్లడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.