ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు కూటమి ప్రభుత్వం... కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు.. ముందుకు వెళ్తోంది. ఏపీలో ఉన్న కూటమి పార్టీలకు న్యాయం జరిగేలా అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే కొంతమేర నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం... తాజాగా టిటిడి పాలక మండలికి సంబంధించిన కీలక ప్రకటన చేసింది. కొత్త టీటీడీ పాలక మండలి ని ప్రకటించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.


అయితే ఈ కొత్త టీటీడీ పాలక మండలికి చైర్మన్ గా అందరూ ఊహించినట్లుగానే టీవీ5 ఛానల్ అధినేత, బి ఆర్ నాయుడు  ను ఫైనల్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే టిటిడి పాలకమండలిలో సభ్యులను కూడా ప్రకటించడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అలాగే గుజరాత్ రాష్ట్రాల్లోని కొంతమందికి అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు... టిటిడి చైర్మన్ గా  టీవీ5 అధినేత బిఆర్ నాయుడును  నియమించడంపై కొత్త చర్చ మొదలైంది.
 

టీవీ5 అధినేత బి.ఆర్ నాయుడు... ఓ క్రిస్టియన్ అని  సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. నిన్న రాత్రి నుంచి... ఈ అంశంను వైసిపి సోషల్ మీడియా... బాగా వాడేసుకుంటుంది. బిఆర్ నాయుడు ఇంట్లో క్రిస్టియన్  మతానికి సంబంధించిన ఫోటోలను చూపిస్తూ... ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది.  బి ఆర్ నాయుడు... క్రిస్టియన్ కాదని... అసలు సిసలు హిందువు అంటూ క్లారిటీ ఇచ్చింది.


తప్పుడు ఫోటోలను ప్రచారం చేస్తున్నారని మండిపడింది. అన్యాయంగా బిఆర్ నాయుడు పైన... క్రిస్టియన్ ముద్ర వేస్తున్నారని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. ఇలా తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోబోతుంది. ఇది ఇలా ఉండగా. దీపావళి అయిపోయిన వారం రోజుల తర్వాత... టిటిడి చైర్మన్ గా... బి ఆర్ నాయుడు బాధ్యతలు తీసుకోబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

TTD