ఎంత దారుణం ? అంటే ఏ రాజశేఖర్ సీటు త్యాగం చేస్తే రజనీకి ఎమ్మెల్యే సీటు వచ్చిందో ... ఆ రజనీ గెలుపు కోసం ఎంతో కష్టపడిన రాజశేఖర్ కు జగన్ తీరని అన్యాయం చేశారు. రాజశేఖర్ ను మంత్రిని చేస్తానని క్యాబినెట్లో తన పక్కన కూర్చుని పెట్టుకుంటానని చిలకలూరిపేట బహిరంగ సభ సాక్షిగా హామీ ఇచ్చిన జగన్... అదే రాజశేఖర స్థానాన్ని లాక్కున్న రజనీని అందలం ఎక్కించి మంత్రిని చేసి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. కేవలం రజనీ గ్లామర్‌కు ఫిదా అయిన జగన్... ఆమె మాయలో పడిపోయి పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తన వెంటే ఉన్న రాజశేఖర్‌ను పక్కన పెట్టేసారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి.
చివరకు గత ఎన్నికల్లో చిలకలూరిపేటలో రజనీపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో తిరిగి మర్రి రాజశేఖర్‌ను పోటీ చేయించాలని జగన్ అనుకున్నారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ వచ్చి యేడాది అవ్వడంతో ఆయన ఎమ్మెల్సీగా ఉండేందుకే ఇష్టపడ్డారు. రజనీని గుంటూరు వెస్ట్ సీటుకు మార్చినా ఆమె ఏకంగా రాజకీయాలకు కొత్త అయిన గల్లా మాధవి చేతిలో ఏకంగా 53 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు. కట్ చేస్తే అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన రజనీని జగన్ ఎమ్మెల్యేను చేసి అందలం ఎక్కించి మంత్రిని చేస్తే ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో ఆమె వైసీపీలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. ఆమె జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది.
ఏ రాజశేఖర్ అయితే జగన్‌ను నమ్ముకుని ఉన్నారో.. మంత్రి పదవి ఇవ్వకపోయినా.. చివరకు ఎమ్మెల్సీ కూడా నాలుగేళ్ల తర్వాత ఇచ్చినా అదే రాజశేఖర్ ఈ రోజుకు వైసీపీకి, జగన్‌కు పూర్తి నమ్మకంతో ఉన్నారు. అలా జగన్ తనను నమ్మిన వాళ్లను నట్టేట ముంచి.. అవసరాల కోసం పార్టీలోకి వచ్చి పదవుల కోసం ప్రాకులాడే వారికి పెద్ద పీఠ వేయడం వల్లే పార్టీ నుంచి ఈ రోజు కీలక నేతలు అందరూ తమ దారి తాము చూసుకుంటున్నారు. జగన్ ఇకపై అయినా నమ్ముకున్న వాళ్లకు.. నమ్మినోళ్లను ముందు పెట్టుకుని రాజకీయం చేస్తే తప్పా పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదు.