పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చినా జనసేన పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు మాత్రం చేయి తడపందే పనులు చేయడం లేదు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం మ‌ర్చిపోయి కాసుల వేట‌లో పోటీప‌డుతున్నారు. డైరెక్ట్ గా రండి.. మ‌ధ్య‌లో ఎవరు వద్దు... నా రూపాయి నాకు ఇచ్చి పని చేసుకోండి అని ఓపెన్ గా బోర్డులు పెట్టి మరి వసూళ్లకు పాల్ప‌డుతున్నారు జనసేనలో ఓ యువ ఎమ్మెల్యే... దోపిడీకే సరికొత్త అర్థం చెబుతున్నా ఆ జనసేన ఎమ్మెల్యే ఎవరు ? ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ఎన్నికలలో జనసేన పోటీ చేసిన 21 స్థానాలు గెలుచుకుంది. అయితే ఒక్క సీటులో మాత్రం తాము కచ్చితంగా ఓడిపోతున్నాం అంటూ జనసేన వాళ్లు కూడా ముందు నుంచి చెబుతూ వచ్చారు. అక్కడ సదరు ఎమ్మెల్యే గెలుస్తాడని జనసేన వాళ్ళకే ఏమాత్రం నమ్మకం లేదు.. ఏదో అయిష్టంగానే ఆ సీటు తీసుకొని ఆ నేతకు బీఫామ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.


వైసిపి సానుకూల సర్వేలు... చివ‌ర‌కు టిడిపి సానుకూల సర్వేలతో పాటు తెలుగుదేశం భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పిన చాలా సర్వేలు సైతం అక్కడ ఎమ్మెల్యే సీటు కచ్చితంగా వైసీపీ గెలుచుకుంటుంది అని చెప్పారు. అలాంటి చోట అనూహ్యంగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన జనసేన ఎమ్మెల్యే రెండు చేతులా కట్టలు కట్టలు పుచ్చుకుంటూ దోపిడికి సరికొత్త అర్థం నిర్వచిస్తున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన ఆ జనసేన ఎమ్మెల్యే గెలవటమే ముక్కిమూలిగి అన్నట్టుగా గెలిచారు. కౌంటింగ్ చివరి రౌండ్‌ వరకు ఆ సీటు జనసేన గెలుస్తుందా ? లేదా అన్న దోబూచులాట జరిగింది. వాస్తవంగా చెప్పాలి అంటే సొంత ఊళ్లో వార్డు మెంబర్ గా పోటీ చేస్తే కూడా గెలిచే సీన్ లేని వ్యక్తి కూట‌మి ప్ర‌భంజ‌నంలో ఏకంగా ఎమ్మెల్యే అయిపోయారు. సొంత మండల జనాలే నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావు.. అని ఛీ కొట్టి వైసిపికి మెజార్టీ కట్టబెట్టారు.


చ‌చ్చీచెడీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆ జనసేన ఎమ్మెల్యే గెలిచిన రెండో నెల నుంచి అవినీతికి గేట్లు ఎత్తేశారు. విచిత్రం ఏంటంటే ఆ నియోజకవర్గంలో జనసేన ఓటింగ్ తో పోలిస్తే టిడిపికి కనీసం 10 రెట్లు ఎక్కువ ఓటింగ్ ఉంటుంది. టిడిపి వాళ్ళు సర్వశక్తులు వడ్డీ ఆ జనసేన ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇప్పుడు టిడిపి నేతలను పూర్తిగా పక్కన పెడుతున్న పరిస్థితి. నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేతలు.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలను సైతం పక్కన పెట్టేస్తున్నారు. ఎవరైనా పనుల కోసం సదరు టిడిపి నేతలను ఎమ్మెల్యే దగ్గరికి తీసుకువెళ్తే... వారిని లోపలికి పిలిచి మీరు ఎందుకు ? వాళ్ళని తీసుకు వస్తున్నారు. మీరు డైరెక్ట్ గా నా దగ్గరకే రండి.. నా రూపాయి నాకు ఇచ్చేయండి పనులు చేయించుకోండి.. ఎవరిని తీసుకురావాల్సిన అవసరం లేదని చెబుతున్న పరిస్థితి.


ఆ ఎమ్మెల్యేకు ఎంత క‌క్కుర్తి అంటే రు. 3 వేల‌కు కూడా క‌క్కుర్తి ప‌డుతూ వెన‌కేసుకుంటున్నాడ‌ట‌. ఓ ఎమ్మెల్యే స్థాయి వ్య‌క్తి రు. 3 వేల‌తో మొద‌లు పెట్టి రు. 5 వేలు కూడా పుచ్చుకుంటున్నాడంటే ఇంత‌క‌న్నా దారుణం ఉంటుందా ? పైగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న కీల‌క ప్రాజెక్టుల దృష్ట్యా ఇసుక బంగారు బాతులాంటిది. ఇప్పటికే ఇసుక మీద ( ప్ర‌భుత్వ కొత్త నిబంధ‌న వ‌చ్చే వ‌ర‌కు) బాగా లాగేసుకున్నాడు. ఇక పంచాయ‌తీరాజ్ నిధులు, సిమెంట్ ర‌హ‌దారుల ప‌నుల్లోనూ 5 - 10 శాతం వ‌ద్దు బాబు 15 శాతం క‌మీష‌న్ తీసుకురండ‌ని చెపుతోన్న ప‌రిస్థితి. ఓ వైపు ప‌వ‌న్ ఇప్ప‌టికే అవినీతిలో పేట్రేగిపోతోన్న ఎమ్మెల్యేల‌కు వార్నింగ్‌లు ఇస్తోంటే ఈ కుర్ర జ‌న‌సేన ఎమ్మెల్యే దోపిడీకి గేట్లు బార్లా ఎత్తేసి కూర్చున్నాడు. ఈ కుర్ర ఎమ్మెల్యేకు బ్రేకులు వేయ‌క‌పోతే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి అక్క‌డ జీరో త‌ప్ప‌దు. మ‌రి ప‌వ‌న్ ఆ కుర్ర ఎమ్మెల్యేను కంట్రోల్ చేయాల‌ని నియోజ‌క‌వ‌ర్గ జ‌నాలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: