దేశ రాజధాని ఢిల్లీలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చాలామంది పెద్దలు చక్రం తిప్పారు. విజయ్ సాయి రెడ్డి - వైవి సుబ్బారెడ్డి - పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది రెడ్డి నేతలు అక్కడ చక్రాలు తిప్పేవారు. పార్టీ ఎప్పుడైతే ఘోరంగా ఓడిపోయిందో ఇప్పుడు వైసీపీకి ఢిల్లీలో యువ ఎంపీ తిరుపతికి చెందిన ఎంపీ మద్దిరాల గురుమూర్తి మాత్రమే పెద్ద దిక్కు అయ్యారు. గురుమూర్తి గెలుపు ఓ చరిత్ర. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేలు గెలుపొందితే గురుమూర్తి ఎంపీగా అనూహ్యంగా విజయం సాధించారు.


అంతకు ముందు ఉప ఎన్నికలలో ఒకసారి గెలిసిన గురుమూర్తి ఇప్పుడు రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. గురుమూర్తి మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. కాస్త కూసో మంచి మనస్తత్వం ఉంది. వైసీపీలో మిగిలిన ఎంపీల‌లా హంగులు .. ఆర్భాటాలు లేవు. పైగా వ్యాపారాలు లేవు.. మంచివాడు .. సౌమ్యుడు అందుకే రెండోసారి కూడా పార్టీ ఘోరంగా ఓడిపోయిన ఎంపీగా విజయం సాధించారు. ఇక ఇప్పుడు ఢిల్లీలో వైసీపీకి పెద్దదిక్కుగా కనిపిస్తున్నారు. పార్లమెంటు పరిధిలో ఎవరైనా సమస్యతో ఆయన దగ్గరికి వెళితే నేరుగా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారట. ఇటీవల కాలంలో తన పార్లమెంటు పరిధిలో ప్రజా సమస్యలపై పలుమార్లు బాధితులను వెంటబెట్టుకుని ఢిల్లీకి ఎక్కువగా వెళుతున్నారు.


మిథున్ రెడ్డి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కూడా ఆయన కంటే ఇప్పుడు గురుమూర్తి హవా ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా నందిగం సురేష్ భార్య ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తే నందిగం కుటుంబం వెంటే గురుమూర్తి ఉన్నారు. ఏపీలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న లైంగిక వేధింపులు - అత్యాచారాలు విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కు వైసిపి మహిళా బృందం ఫిర్యాదు చేస్తే అక్కడ కూడా గురుమూర్తి ఉన్నారు. ఏది ఏమైనా గురుమూర్తి ఇప్పుడు ఢిల్లీలో వైసీపీకి పూర్తి అండదండలతో కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: