- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

ఆంధ్రప్రదేశ్లో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయి కేవలం 23 సీట్లకే పరిమితం అయింది. అక్కడి వరకు బాగానే ఉంది కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు 2019లో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయి కేవలం 23 సీట్లకే పరిమితం కావటం వెనక కూడా చాలా కారణాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా అప్పట్లో ఆంధ్రజ్యోతి మీడియాపై చాలా విమర్శలు వచ్చాయి. ఆంధ్రజ్యోతి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించిందని .. ఆంధ్రజ్యోతి ఇష్టం వచ్చినట్టుగా జగన్ ను టార్గెట్ చేసిందని ... అది అంతిమంగా వైసీపీకి మైనస్ కాకుండా టిడిపికి మైనస్ .. వైసీపీకి చాలా ప్లస్ అయింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.


సాక్షి జగన్ కు ఎంత ప్లస్ అయిందో  .. ఇప్పుడు అంత మైనస్ అవుతుంది. ఐదేళ్లపాటు జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను ఇష్టం వచ్చినట్టు మోసుకుంటూ వచ్చింది. సాక్షి జ‌నాలు సాక్షి మీడియా వరకు పనిచేసిన బాగుండేది. అయితే సాక్షికి చెందిన చాలామంది ఉద్యోగులను జగన్ చుట్టూ పీఆర్వోలుగా జగన్ వ్యక్తిగత కార్యదర్శులుగా ... వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టి ఇష్టం వచ్చినట్టు నడిపించుకుంటూ వెళ్లారు. చివరకు సాక్షి నుంచి వచ్చిన వాళ్లు జగన్ దగ్గర హవా చలాయించడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలు .. మంత్రులు జగన్ ను కలవాలన్నా సాక్షి నుంచి వచ్చిన రిపోర్టర్లు కీలకపాత్ర పోషించేవారు.


ఇప్పుడు పార్టీ ఓడిపోయాక కూడా అదే జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు వైసీపీలో సాక్షి బ్యాచ్ ముసలం అంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచేందుకు కారణమైంది. జగన్ ఇప్పటికైనా వైసీపీ తన రాజకీయ వ్యవహారాలలో సాక్షి టీం ఎంటర్ కాకుండా చూసుకుంటే బాగుంటుంది. మ‌రి జ‌గ‌న్ దీనిపై ఎంత వ‌ర‌కు దృష్టి పెట్టి సాక్షిని వైసీపీ పొలిటిక‌ల్ యాక్ష‌న్‌కు దూరంగా ఉంచుతారో ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: