- ( గ్రేటర్ హైదరాబాద్ - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కూడా వైసిపి సానుభూతిపరులకు పెద్ద ఎత్తున కీలక పెదవులు .. పోస్టింగులు దక్కుతున్నట్టు ఎల్లో మీడియాలోనే చాలా వార్తలు వస్తున్నాయి. స్వయంగా టిడిపి శ్రేణులు కూడా సోషల్ మీడియా వేదికగా గతంలో ఎన్నడూ లేని రీతిలో చంద్రబాబుపై ఈ విషయంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఒక కీలక ఐఏఎస్ పోస్టింగ్ విషయంలో వైసిపి సిఫారసులు వర్క్ అయినట్టు అధిక వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఆ ఐఏఎస్ కు వైసిపి తో లింకులు ఉన్నాయని అధికారులు చెబుతున్నాయి. అదే సమయంలో బిఆర్ఎస్ కేలకనేత ఒకరు సిఫార్సు చేస్తూ ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని తనకు ఎంతో సన్నిహితుడైన మంత్రి ద్వారా వైసిపి కీలక నేత తో సిఫార్సు చేయించార.ట అది ఇప్పుడు వర్క్ అవుట్ అయింది.
ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ వర్గాలలో ప్రచారం జరుగుతుంది .మామూలుగా అలాంటి కీలకమైన పోస్టులలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ముఖ్యమంత్రి కి అత్యంత నమ్మకస్తుడిని నియమించుకుంటారు.. అధికారిక ప్రభుత్వంలో సున్నితమైన సమాచారం కూడా తెలుస్తుంది. కానీ అలాంటి పోస్టులో మంత్రికి కావలసిన వాళ్లను అందులో కూడా రేవంత్ రెడ్డి అంటే పడని వైసీపీ పార్టీకి చెందిన కీలక నేత సిఫార్సు చేసిన వాళ్ళను వేసుకోవటం విడ్డూరంగా ఉందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు సైతం చెవులు కోరుక్కుంటున్నాయి. వాస్తవానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తీవ్ర విమర్శలు ఎదుర్కొని భూ లావాదేవీలలో కీలకపాత్ర పోషించిన అధికారం కోసం ఏకంగా ఏపీ నుంచి సిఫార్సు రావడం అది వెంటనే అమలులోకి రావడం ఇప్పుడు అధికార వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.