అమెరికా మద్దతుతో తమ దేశంపై ఎదురు తిరిగిన ఉక్రెయిన్‌పై రష్యా రెండేళ్ల క్రితం సైనిక చర్య చేపట్టింది. తీవ్రం నష్టం జరిగినా ఉక్రెయిన్ ఎక్కడా తలొగ్గడం లేదు. అమెరికా, బ్రిటన్‌తోపాటు నాటో దేశాల సహకారంతో రష్యాపైనా దాడులు చేస్తోంది. నాలుగైదు నెలల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం రెండేళ్లయినా ఆగడంలేదు. రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల రష్యాలో పర్యటించిన అమెరికా బద్ధ శత్రువు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు సాయం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇటీవలే 12 వేల మంది సైన్యాన్ని రష్యాకు పంపించారు. తాజాగా ఉక్రెయిన్‌సైన్యం యుద్ధరంగంలోకి దగింది. దీనిపై అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా స్పందించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేసే ఉత్తర కొరియా సైనికుల శవాలు బ్యాగుల్లో తిరిగి ఉత్తర కొరియాకు వెళ్తాయని హెచ్చరించింది.
రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దలాలు ఉక్రెయినేలోకి ప్రవేశిస్తే కచ్చితంగా ఉత్తర కొరియా సైనికుల శవాలను ఉత్తర కొరియాకు పార్శిల్ చేస్తాం. ప్రమాదకరమైన చర్యలకు పాల్పడడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఈ విషయంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్‌కు సూచిస్తున్నాం' అని ఐక్యరాజ్యసమితిలో యూఎస్ డిప్యూటీ రాయబారి రాబర్ట్ వుడ్ సూచించారు.
ఇక పరిస్థితులు చూస్తుంటే.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. తాజాగా ఇరు దేశాలు మరోసారి పరస్పరం దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ ప్రాంతాలపై రష్యా బలగాలు దాడులు చేయగా, అందుకు ప్రతీకారంగా ఉక్రెయిన్ పెద్ద సంఖ్యలో డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది. కీవ్ సహా పలు ప్రాంతాల్లో రష్యా 62 డ్రోన్లు, ఒక క్షిపిణితో దాడి చేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం ధ్రువీకరించింది. వీటిలో 50కిపైగా డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపింది.
రష్యా యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్న 398 సంస్థలపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా, భారత్, చైనా, మరో డజనుకుపైగా ఇతర దేశాలకు చెందిన 398 సంస్థలు ఉన్నాయని తెలిపింది.