టీటీడీ పాలకమండలిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి కూడా అవకాశం లభించింది. టీడీపీ నుంచి నర్సిరెడ్డికి, జనసేన నుంచి మహేందర్ రెడ్డికి చోటు దక్కింది. చైర్మన్ గా బీ ఆర్ నాయుడు పేరును ప్రకటించింది.  మొత్తంగా 24 మందితో కూడిన సభ్యులతో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారు.


 

బీఆర్ నాయుడి పేరును చైర్మన్ గా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించకపోయినప్పటికీ.. పాలకమండలిలో ఒక వ్యక్తి పేరు మాత్రం మీడియా వర్గాలను ప్ షాక్ కు గురిచేసింది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. నియమించిన పాలకమండలిలో ఆయన ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసిన పాలక మండలి లోనూ అతడు సభ్యుడుగా ఉన్నారు. ఆ సభ్యుడి పేరు ఆదిత్ దేశాయ్..



ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యుడు కేతన్ దేశాయ్ కుమారుడు. కేతన్ దేశాయ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు ఛైర్మన్‌ గా పనిచేశారు. ఈయన టీటీడీ పాలకమండలిలో సభ్యుడు కావడం ఏంటని చాలామంది హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ సాగించి.. కేతన్ దేశాయ్ ని పాలకమండలిలో సభ్యుడిగా నియమించడాన్ని తప్పు పట్టింది. ప్రభుత్వ వ్యవహారశైలి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

 

 

ఇదిలా ఉండగా.. నాడు వైసీపీ ప్రభుత్వంలో.. నేడు కూటమి ప్రభుత్వంలో బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కించుకున్నారంటే అదిత్ దేశాయ్ ఎంత శక్తివంతుడో అర్థం చేసుకోవచ్చు. అతడు జూనియర్ వైద్యుల సంఘాలను నిర్వహిస్తున్నాడు. బిజెపి పెద్దలకు అత్యంత దగ్గరగా ఉంటాడు. అందుకే పార్టీలతో సంబంధం లేకుండా టీటీడీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. స్థూలంగా చెప్పాలంటే పాలక మండలి లో సగం మంది బిజెపి సిఫారసు చేసిన వ్యక్తులే. ఇక రామోజీరావు మనవరాలి అత్తగారు సుచిత్ర ఎల్లా కు సభ్యురాలిగా అవకాశం లభించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd