ఆంధ్రప్రదేశ్లో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. సుమారుగా ఐదు నెలల పది రోజులు అవుతోంది. ప్రతిపక్ష పార్టీ అయినా వైసీపీ ఆరు నెలల సమయం అన్ని పథకాలను అమలు చేయడానికి హనీమూన్ పీరియడ్ అన్న పేరుతో వీరికి ఇచ్చింది. అయితే అది కూడా త్వరలోనే పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అమలు చేయవలసిన పథకాలతో పాటు అభివృద్ధి చేయడంలో కూడా వెనుకబడిందని భావన ప్రజలలో కనిపిస్తోందట. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల విషయంలో ఏమాత్రం అడుగులు ముందుకు వాడడం లేదని విమర్శలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.


సూపర్ సిక్స్ హామీలలో కేవలం రెండిటిని మాత్రమే అమలు చేస్తున్నారు.. ఒకటి పెన్షన్ పెంపు మరొకటి ఉచిత గ్యాస్ సిలిండర్ నిన్నటి రోజున అమలు చేశారు. ఇక రాజధాని విషయంలో కాస్త కదలిక కనిపించిందని వార్తలు వినిపిస్తున్నాయి కానీ రోడ్లు, గ్రామాలలోని రోడ్లు ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించడం లేదట. అభివృద్ధి అనే పదం కేవలం కాగితాల మీదికే పరిమితమైందని సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఎలాంటి సంపద సృష్టించకుండా అప్పులు చేస్తున్నారనే వార్త ఇప్పుడు వినిపిస్తోంది.


గతంలో వైసిపి పాలనలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు చూసి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది, పాకిస్తాన్ అవుతుందని ఏపీ ప్రజలను భయపెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏపీ సీఎంగా ఐదు నెలల ప్రభుత్వంలోనే సుమారుగా 54 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఇప్పటిదాకా 47 వేల కోట్లను కూటం ప్రభుత్వం అప్పుగా తీసుకువచ్చినట్లు సమాచారం. మరి కొద్ది రోజులలో 7000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకురాబోతున్నారట. ఏడాది ఆర్థిక సంవత్సరానికి కేంద్రం కేవలం 45 కోట్లు ఉందని చెప్పగా దానికి మించి ఇప్పుడు అప్పు చేస్తోంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సంక్షేమాలు కూడా అమలు చేయలేదు.. అయినప్పటికీ కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: