వాస్తవంగా పోలవరం ప్రతిపాదించినప్పుడు 45.17 మీటర్లు(150.2 అడుగులు) ఎత్తుతో నిర్మించాలని భావిం చారు. కానీ, కేంద్రం మాత్రం దీనిని 41.96 మీటర్లకు కుదించింది. ఇది ఎవరి పాపం? అనేది ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న వివాదం. . జగన్ హయాంలోనే ఎత్తును తగ్గించారని..అప్పట్లో ఆయన మౌనంగా ఉన్నాడని.. . అందుకే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెబుతోంది. .
అయితే.. అసలు కేంద్రం నిర్మించాలన్న ప్రాజెక్టును రాష్ట్రం తీసుకోవడం ఏంటి? జరగాల్సిన తప్పు అప్పుడే జరిగిపోయిందని వైసీపీ నుంచి ఎదురు దాడి జరుగుతోంది. ఇక, దీనికి మధ్యే మార్గంగా మంత్రి నిమ్మల రామానాయుడు సరికొత్త ప్రతిపాదన చేశారు. అదే.. తొలిదశలో 41.96 మీటర్లు నిర్మిస్తారని, మలి దశలో పూర్తిస్థాయిలో 45.17 మీటర్లు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. కానీ, కేంద్రంలో మాత్రం తొలి-మలి అనే రెండు దశలు లేవన్నది ఆయనకు కూడా తెలిసిందే.
ఉన్నది ఒక్కటే దశ. గతంలో జగన్ ఈ ఎత్తు విషయంలోనే కేంద్రంతో పేచీపడ్డారు. దీంతో కాలం గడిచిపోయింది. అడుగు కూడా ముందుకుపడలేదు. దీనిని వ్యూహాత్మకంగా భావిస్తున్న కూటమి సర్కారు ముందు పనులు జరిగితే చాలు.. .అని 41.96 మీటర్లకు తలూపింది. ఇంతకుమించి భవిష్యత్తులో జరిగేదీ.. . . .ఒరిగేది కూడా ఏమీ ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. సో.. మొత్తానికి పోలవరం.. మళ్లీ మళ్లీ రాజకీయ వివాదాలకు కేంద్రంగానే మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.