ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆలపాటి రాజా పేరు తెలుగుదేశం పార్టీలో ఖరారు చేశారు. ఇక పెదకూరపాడు సీటు వదులుకున్న కొమ్మలపాటి శ్రీధర్ కు బహిరంగంగానే చంద్రబాబు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. తాను ఎక్కడ ? ఎవరికి హామీ ఇవ్వలేదని భాష్యం ప్రవీణ్‌ను గెలిపించుకొని వస్తే కొమ్మలపాటికీ ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు చెప్పారు. భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొమ్మలపాటికి త్వరలోనే ఎమ్మెల్సీకి లైన్ క్లియర్ చేస్తున్నారు. అటు ఆలపాటి రాజాకు.. కొమ్మలపాటి శ్రీధర్ కు గుంటూరు జిల్లాలో లైన్ క్లియర్ అవుతుంది.
అయితే కృష్ణా జిల్లా తెలుగుదేశం రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి దేవినేని ఉమా పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా ఉంది. అసలు ఉమా పేరు చంద్రబాబు, లొకేష్ ఎవరు ఎత్తటం లేదని తెలుస్తోంది. ఉమా లాంటి నేతను పక్కన పెట్టి వైసిపి నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్‌కు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం ఆయన మైలవరం ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయాయి. ఉమాకు ఎంపీ సీటు లేదా రాజ్యసభ ఇచ్చే పరిస్థితి లేదు.. కనీసం ఎమ్మెల్సీ ఇద్దామనుకుంటే.. కమ్మ ఎమ్మెల్సీలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆ ఛాన్స్ కూడా లేదని తెలుస్తోంది.
అటు లోకేష్ కూడా ఉమా విషయంలో అంతా సుముఖంగా లేరని ప్రచారం జరుగుతుంది. ఉమా విషయంలో కృష్ణా జిల్లా టీడీపీ వాళ్లే తెలియకుండా కావాల్సినన్ని కంప్లైంట్లు అధిష్టానం దగ్గర పెడుతున్నారట. ఏది ఏమైనా ఆలపాటి, కొమ్మాలపాటి ముద్దే ముద్దు అంటున్న చంద్రబాబు... లోకేష్ ఉమా విషయంలో కాస్త లైట్‌గానే ఉన్నారా ? అన్న గుసగుసలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.