కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు పిల్లలు, పెద్దలు అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ 70 ఏళ్లు దాటిన వాళ్లకు ఉచిత బీమా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం ఈ ఆరోగ్య బీమాను అమలు చేస్తుండటం గమనార్హం. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఈ స్కీమ్ అమలు కానుంది.
 
ఈ స్కీమ్ లో అర్హత ఉన్నవాళ్లకు 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా లభించనుంది. మన దేశంలో నివశిస్తున్న 70 ఏళ్లకు పైబడిన వృద్ధులంతా ఈ స్కీమ్ కు అర్హులు. ఈ స్కీమ్ కింద అదనపు బీమా లభిస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉంటే 5 లక్షల రూపాయల వరకు అదనపు కవరేజీ లభించనుండటం గమనార్హం.
 
70 సంవత్సరాలకు పైబడిన వ్యక్తులు కుటుంబంలో ఇద్దరు ఉంటే చెరో 2.5 లక్షల రూపాయల వైద్య సహాయం పొందే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ సహాయంతో వైద్య పరీక్షలు, ఇతర సేవలు సైతం పొందే అవకాశాలు ఉంటాయి. ఆయుష్మాన్ భారత్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ఈ స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ కోసం ఆధార్ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
 
ఆయుష్మాన్ వయ వందన కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందవచ్చు. మన దేశంలో 30,000 ఆస్పత్రులు ఈ స్కీమ్ కింద నమోదై ఉండటం గమనార్హం. ఈ స్కీమ్ లో అర్హత ఉన్నవాళ్లకు నగదు రహిత చికిత్స అందే అవకాశాలు ఉంటాయి. 14555 నంబర్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: