తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం తీసుకొని దాదాపు ఏడాది పూర్తి కావస్తోంది. అయితే ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పుకుంటూ ప్రజలను నమ్మించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత... ఫ్రీ బస్సు మినహా ఏ ఒక్క పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు పరచడంలో విఫలమవుతోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయాన్ని... స్వయంగా ప్రజలే చెబుతున్నారు.
అయితే దీనికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ ప్రతిపక్ష హోదాను సమర్ధవంతంగా కొనసాగిస్తోంది. రేవంత్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన గులాబీ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. హైడ్రా, మూసి ప్రక్షాళన, కరెంటు చార్జీల పెంపు ఇలా చాలా అంశాల్లో గులాబీ పార్టీ చాలా సమర్థవంతంగా పోరాటం చేసింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో... రేవంత్ రెడ్డి పైన... కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసిందట.
రేవంత్ రెడ్డి పనితీరు కారణంగా కాంగ్రెస్ పార్టీ... నష్టపోతుందని రాహుల్ గాంధీ ఆయనకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట. కేరళకు వెళ్లినా కూడా అక్కడ... రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలవలేకపోయారట. దీంతో అతి త్వరలోనే రేవంత్ రెడ్డిని మార్చేస్తారని... చాలామంది అంటున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి... కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.