ఈ విషయం వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో అభ్యర్థులు అసహనానికి గురయ్యారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం స్పందిస్తున్నప్పటికీ ఇప్పుడు ఎట్టకేలకు ఒక గుడ్ న్యూస్ను తెలియజేసింది.
పోలీస్ రిక్రూమెంట్ బోర్డు ఇన్చార్జి చైర్మన్ రవికృష్ణ అధికారికంగా ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ఏడాది డిసెంబర్ చివరిలో కల్లా ఫిజికల్ ఈ టెస్ట్ లో నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలియజేశారు. అయితే ఇప్పటివరకు ప్రిలిమనరి పరీక్షకు సైతం అర్హత సాధించిన వారిలో కేవలం 91,507 మంది మాత్రమే అభ్యర్థులు తమ ఫిజికల్ టెస్ట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని. అయితే గతంలో కొన్ని కారణాలవల్ల అప్లై చేసుకొని వారికి కూటమి ప్రభుత్వం భర్తీ చేసేందుకు మరొకసారి వారికి అవకాశం కల్పించింది. అంటూ తెలిపారు. పిఈటి టెస్ట్ కోసం ..నవంబర్ 11వ తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వారు తిరిగి మళ్లీ అప్లై చేసుకోవచ్చు అంటూ అభ్యర్థులకు తెలియజేసింది.
మొత్తానికి ఎట్టకేలకు కానిస్టేబుల్ అభ్యర్థులకు సైతం కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడంతో అభ్యర్థులు కాస్త ఆనందపడుతున్నారు. ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు ఉద్యోగం సాధించాలని ఇతర ప్రాంతాలలో సిద్ధమవుతూ ఉన్నారు. మరి మెయిన్ ఎగ్జామ్ కి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తారేమో చూడాలి మరి.