తప్పు చేసిన వారిని వదిలిపెట్టనని రాజకీయ కక్ష సాధింపులకు పోనని చంద్రబాబు పేర్కొన్నారు. నాయకుడు అంటే ప్రజల మనస్సులో అభిమానం ఉండాలని తెలిపారు. ఎన్డీఏ సర్కార్ మాత్రమే ఫ్రీ ఇసుకను ఇస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తానని బాబు పేర్కొన్నారు. అమరావతిని మళ్లీ గాడిలో పెట్టామని ఇందుకు కేంద్రం కూడా సహకరించిందని చంద్రబాబు తెలిపారు.
గ్యాస్ సిలిండర్ కు కట్టిన డబ్బు 48 గంటల్లో రిఫండ్ అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. సిలిండర్ కు డబ్బు కట్టే పని లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. అన్ని రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ పింఛను ఇస్తున్నామని పింఛను మొత్తాన్ని 3 నెలలకు ఒకసారి కూడా తీసుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. పింఛన్ డబ్బును గౌరవంగా ఇంటి వద్దే ఇవ్వాలని ఆదేశించామని చెప్పుకొచ్చారు.
విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కు లైన్ క్లియర్ చేశామని బాబు పేర్కొన్నారు. మూలపేటలో 10,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పిన వార్త పింఛన్ లబ్ధిదారులకు ఎంతో ఆనందాన్ని కలిగించిందనే చెప్పాలి. బాబు హామీలపై ఏపీ ప్రజల నుంచి పాజిటివ్ రియాక్షన్ వెలువడుతోంది. చంద్రబాబు ప్రజలకు మంచి చేకూరే నిర్ణయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.