అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు సూపర్ సిక్స్ గ్యారెంటీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో దీపం పథకం ఒకటి. ఈ స్కీమ్ కింద అర్హులైన మహిళలకు నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మొత్తం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంతో.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దీపం పథకానికి చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టింది. దీపం పథకంలో భాగంగా 2024, అక్టోబర్ 29వ తేదీ నుండే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రాసెస్ మొదలు కాగా.. 2024, నవంబర్ 1న లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు.ఇందులో భాగంగా స్వయంగా చంద్రబాబే లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి ఫ్రీ గ్యాస్ సిలిండర్ అందజేశారు. గ్యాస్ పంపిణీ చేయడమే కాకుండా ఆయన చేతులతోనే స్టౌ వెలిగించి ఆయనే టీ పెట్టారు. అనంతరం టీ తాగుతూ లబ్దిదారులతో ముచ్చటించారు. ప్రభుత్వ పాలన గురించి, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే దానిపై చంద్రబాబు ఆరా తీశారు. ఈదుపురంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

ఇదిలావుండగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించిన సందర్భంగా సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు.మహిళలు తొలత డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండానే సిలిండర్ అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం లబ్ధిదారులు డబ్బులు చెల్లిస్తే రెండు రోజుల్లో ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ నేపథ్యంలో నేరుగా ఫ్రీ సిలిండర్ ఇచ్చేందుకు సాంకేతిక సమస్యలు వస్తున్నాయి.త్వరలోనే వాటిని పరీష్కరిస్తాం అని అన్నారు.ఇదిలావుండగా 'ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.2684 కోట్లు ఖర్చు చేస్తుంది, 5 సంవత్సరాలకు రూ.13,425 కోట్లు ఖర్చు చేయబోతోంది. గత ప్రభుత్వం సంక్షేమం తమకంటే ఎవరూ బాగా చేయలేరు అన్నారు. వారికంటే బాగా చేసి చూపిస్తున్నాం. డబ్బు దోచుకోడం తప్పా ఇచ్చే మనసు లేని వారు వైసీపీ నాయకులు. మనకి దోచుకునే అవసరం లేదు, జేబులోంచి డబ్బులు తీసి ప్రజలకు ఇచ్చే మనస్తత్వం మన నాయకులది' అని పవన్ వ్యాఖ్యానించారు.అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 64,14,000 మందికి పెన్షన్ అందిస్తున్నాం. రూ.2,710 కోట్లు ఒక్క నెలకే ఖర్చు పెడుతున్నాం. ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అపారమైన పరిపాలనా అనుభవం ఉండబట్టే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి' అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: