ఇలాంటి దుర్మార్గులను ఎంతమందిని తొక్కి నార తీశారో చెప్పాలి అంటూ రోజా సెటైరికల్ గాని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకీ మత్తు పదార్థాలు విచ్చలవీధిగా లభిస్తున్నాయని నాలుగు నెలలలోనే వంద మందికి పైగా మహిళలపై ఇలాంటి అత్యాచారాలు జరుగుతూ ఉండడం కూటమి ప్రభుత్వానికి కనిపించలేదా అంటూ రోజా విమర్శించింది. ఇలాంటి సమయంలోనే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు.
నిందితుడు పైన కఠిన చర్యలు తీసుకోవాలంటు అధికారులకు కూడా ఉత్తర్వులను జారీ చేశారు.బాలిక కుటుంబానికి సైతం ప్రభుత్వం అండగా ఉంటుందని 10 లక్షల రూపాయలు బాధ్యత కుటుంబానికి అందజేసే విధంగా అక్కడ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సైతం ఆదేశాలను జారీ చేసేలా చేశారు సీఎం చంద్రబాబు.. అంతేకాకుండా మహిళల పైన ఇలాంటివి జరగాలి అంటే ఇక మీదట భయపడేలా చేస్తామంటూ సీఎం చంద్రబాబు తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఇప్పటికే చాలామంది నేతలలోనే నేతలకు సరైన పొంతన కనిపించలేదు. అక్కడక్కడ గొడవలు , దుర్భాషలాడుతూ ఉన్నటువంటి కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.