ఇక చంద్రబాబు పొలిటికల్ కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా ఇలా కూటమితో కలసి నడిపించాల్సి వచ్చింది.. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం చెప్పిన వాటి మీద ప్రజలు బాగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ అందుకు తగ్గట్టుగా ఇప్పుడు కూటమి సర్కార్ మాత్రం పవర్ఫుల్గా జనంలోకి వెళ్లలేకపోతోంది అని చర్చ మొదలయ్యిందట. అందుకు కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయని ముఖ్యంగా ఇసుక మద్యం వంటి వాటిపైన ప్రభుత్వ పాలసీలు దెబ్బతీసేలా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఉచిత ఇసుక అని చెప్పిన గ్రౌండ్ లెవెల్ లో మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదట. అలాగే మద్యం పాలసీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు వైన్ షాపులు ఇవ్వడంతో మద్యం కూడా వైన్ షాపులను దాటేసి ఊరురా బెల్ట్ షాపులు చాలానే వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయట. దీంతో కూటమి ప్రభుత్వం పైన విమర్శలు కూడా వినిపిస్తున్నాయట. ఇది మహిళలకు ఇబ్బందిగా మారుతోందట. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద జరుగుతున్న సంఘటనలు అత్యాచారాలు ఘోరాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యానికి దారితీస్తున్నాయి. ఇలాంటి వైఫల్యాలు అన్నీ కూడా వైసిపి పార్టీకి నోరు విప్పెలా చేస్తున్నాయి. అంతేకాకుండా సీనియర్ నేతలు కూడా ఒక్కొక్కరు టిడిపి పార్టీని వీడుతూ ఉన్నట్లు సమాచారం. మరి కూటమి సర్కార్ ఆలోచించి అడుగులు వేస్తుందా లేకపోతే ఏం చేస్తుందో చూడాలి.