వైసీపీ నాయ‌కుడు, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన మేధావి.. మాజీ ప్రొఫెస‌ర్ మేరుగ నాగార్జున విష‌యం శుక్ర‌వారం రోజు రోజంతా హాట్ టాపిక్‌గా మారింది. వాస్త‌వానికి సీఎం చంద్ర‌బాబు ఉచిత గ్యాస్ ప‌థ‌కాన్ని క‌నుక ప్రారంభించ‌క‌పోయి ఉంటే.. ఇదే హైలెట్ అయ్యేది. అయిన‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ వ్య‌వ‌హారం.. దుమ్మురేపింది. విజ‌య‌వాడ‌కు చెందిన ప‌ద్మావ‌తి అనే మ‌హిళ‌.. మాజీ మంత్రి నాగార్జున పై ఫిర్యాదు చేసింది.


త‌న నుంచి 90 ల‌క్ష‌ల‌రూపాయ‌లు తీసుకున్నార‌ని.. వైసీపీ హ‌యాంలో కాంట్రాక్టులు ఇప్పిస్తామ‌ని చెప్పార ని.. కానీ, ఆ ప‌నులు ఇప్పించ‌లేద‌న్న‌ది ఆమె ఆరోప‌ణ‌. దీనికి కొంత మ‌సాలా కూడా జోడించారు. త‌న‌పై లైంగిక దాడి చేశార‌ని కూడా స‌ద‌రు మ‌హిళ చెప్పుకొచ్చారు. వాస్త‌వానికి ఇలాంటివి వ‌చ్చిన‌ప్పుడు.. టీడీపీ నాయ‌కులు వ‌దిలి పెట్ట‌రు. ఇంటా బ‌య‌టా కూడా.. పెద్ద ఎత్తున స్పందిస్తారు. కానీ, ఎందుకో ఈ విష‌యాన్ని చూసీ చూడ‌న‌ట్టు, తెలిసీ తెలియ‌న‌ట్టే వారు వ‌దిలేశారు.


క‌ట్ చేస్తే.. ఈ ఫిర్యాదు వ‌చ్చిన రెండు మూడు గంట‌ల్లోనే నాగార్జున కూడా రియాక్ట్ అయ్యారు. అస‌లు కేసును పూర్తిగా విచారించాల‌ని.. ఏం జ‌రిగిందో తేల్చాల‌ని కోరుతూ.. ఆయ‌న రివ‌ర్స్ కేసు పెట్టారు. దీంతో ఈ క‌థ యూట‌ర్న్ తీసుకుంది. అస‌లు వివాదం నిజ‌మేనా?  నిజ‌మైతే.. కార‌ణాలు ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. కాక‌పోతే.. ఎవ‌రు చేయించారు?  దీనివెనుక నాగార్జున‌ను టార్గెట్ చేయాల్సిన అవ‌స‌రం ఏంటనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రిగింది.


ప‌ద్మావ‌తి అనే మ‌హిళ వాస్త‌వం. విజ‌య‌వాడ‌కు చెందిన వారేన‌న్న‌ది కూడా నిజం. కానీ, ఆమెకు వేమూరు లో ఉన్న నాగార్జున‌కు మ‌ధ్య ప‌రిచ‌యం ఉంద‌న్న‌ది ఎంత వాస్త‌వ‌మో అనుమాన‌మే. కానీ, ఈ వ్య‌వ‌హారా నికి రాజ‌కీయంగా రంగు పులుముకోవ‌డానికి వైసీపీలోకి ఓ కీల‌క ఎస్సీ నాయ‌కుడి హ‌స్త‌మే ఉంద‌ని భావిస్తు న్నారు. ఆయ‌న కూడా గుంటూరుకు చెందిన నాయ‌కుడు. పైగా స‌మీప నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేతేన‌న్న‌ది టీడీపీ నాయ‌కుల మాట‌.


ఆయ‌నే ఉద్దేశ పూర్వ‌కంగా ఈ కేసును పెట్టించార‌న్న‌ది ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌. కానీ, ఇంత‌గా నాగార్జున‌ను టార్గెట్ చేయ‌డానికి స‌ద‌రు నేత‌కు కాంట్రాక్టులు అడ్డుకోవ‌డ‌మేన‌ని తెలుస్తోంది. అంటే.. మొత్తంగా ఈ కేసు పూర్వాప‌రాల‌ను ప‌రిశీలిస్తే.. టీడీపీలో చేరేందుకు రెడీగా ఉన్న ఎస్సీ నాయ‌కుడు.. నాగార్జునను టార్గెట్ చేయ‌డం ద్వారా త‌న హ‌వాను పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించార‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల భావ‌న‌. మ‌రి ఏం జ‌రిగిందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: