రెండు నెలల క్రితం విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. విజయనగరం జిల్లా నుంచి విశాఖకు వచ్చిన వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి పోటీ చేశారు. ఆయన బలమైన అభ్యర్థి కావడంతో పాటు స్థానిక సంస్థల నుంచి వైసీపీకి మెజార్టీ అభ్యర్థులు ఉండడంతో కూటం నుంచి ఎవరూ పోటీ చేయలేదు. చివరకు బొత్స ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా విజయం సాధించారు. బొత్స ఎమ్మెల్సీ పదవి తో పాటు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కూడా అయిపోయారు. ఇప్పుడు బొత్సకు జగన్ అగ్నిపరీక్ష పెట్టారు.
బొత్స సొంత జిల్లా విజయనగరంలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 28న స్థానిక సంస్థల కోటాలో జరిగే ఉపఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 1న ఫలితాలు వస్తాయి ..విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ సీటు చాలా సులువుగా గెలుచుకున్న బొత్స కు ఇప్పుడు సొంత జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిని పార్టీ తరఫున గెలిపించడం ఒక సవాల్ గా మారింది. విజయనగరం జిల్లాలో కూడా స్థానిక సంస్థలు అన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి. మెజార్టీ వైసీపీకే ఉంది. ఆ సీటు కూడా వైసీపీదే.
దీంతో ఇప్పుడు జగన్ కూడా బొత్స కు ఈ సీటు గెలిపించుకు రావాలి అని అగ్ని పరీక్ష పెట్టినట్టు తెలుస్తోంది. సరైన అభ్యర్థిని బరిలోకి దించి బొత్స అన్ని తానే చూసుకుంటే వైసీపీ చేతులకి ఎమ్మెల్సీ సీటు పడటం పెద్ద కష్టం కాదు అన్న అభిప్రాయం ఉంది. బొత్స సొంత జిల్లా కాబట్టి ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.. శాసనమండలిలో వైసిపి పక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. మరి బొత్స తన సీనియార్టీ చూపించి ఈ ఎమ్మెల్సీ స్థానం వైసిపి ఖాతాలో పడేలా చేస్తారా లేదా అన్నది చూడాలి.