సినిమా హీరోలు, హీరోయిన్లతో పాటు రాజకీయ నాయకులకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. వీళ్లు ఓకే కానీ.. కొంత మంది డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. తమ అభిమాన నటులను కళ్లారా చూస్తే చాలని కొందరనుకుంటే వాళ్లను ఒక్కసారైనా తాకాలి ,హత్తుకోవాలి వారితో కలిసి ఓ ఫొటో తీసుకోవాలి రెండు మాటలైనా మాట్లాడాలి అని డైహార్డ్ ఫ్యాన్స్ తహతహలాడిపోతుంటారు. తీరా వాళ్లు ముందుకొచ్చి నిలబడితే.. ఆ తట్టుకోలేని ఆనందంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. అచ్చంగా అలాంటిదే జరిగింది ఏపీలోని అనకాపల్లిలో. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనలో ఓ మహిళా అభిమాని ఆయనను కలిసింది. ఆయనతో ఫొటో తీసుకుంది. అంతటితో ఆగకుండా ఏకంగా సీఎం చంద్రబాబుకు ముద్దు పెట్టేసింది.అసలు విషయానికొస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రిషి కొండపై నిర్మించిన ప్యాలెస్ ప్రధాన వార్తల్లో నిలిచింది. ఆ భవనం నిర్మించిన తీరు.. దానికి అద్దిన హంగులు.. చేసిన ఖర్చు అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ భవనాన్ని అచ్చెన్నాయుడు, టిడిపి నాయకులు పరిశీలించి  నాడు ఆ భవన నిర్మాణం కోసం ఎంత ఖర్చు చేశారు? ఎక్కడినుంచి సామగ్రి తెప్పించారు? ఇందులో నాడు వైసిపి నాయకులు ఎంత నొక్కేశారు? అనే విషయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. దీనిని వైసీపీ ఖండించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో శనివారం పర్యటించారు. ఇందులో భాగంగా రిషికొండ వద్ద నిర్మించిన ఆ ప్యాలెస్ ను పరిశీలించారు.. అందులో ఏర్పాటు చేసిన సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోయారు. ఇంతటి స్థాయిలో రాజ సౌధాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని జగన్ ప్రభుత్వ ధనాన్ని ఇలా ఖర్చు చేశాడు కాబట్టే ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయన రిషికొండ వద్ద ఉన్న ప్యాలస్ వద్దకు వెళుతుండగా  ఒక మహిళ అంతటి సెక్యూరిటీని కూడా ఛేదించుకొని చంద్రబాబు వద్దకు వచ్చింది. చంద్రబాబును గట్టిగా పట్టుకుంది. చంద్రబాబు వారిస్తున్నప్పటికీ ఆమె ఆయనను వదిలి వెళ్ళలేదు. పైగా ఆయనకు ముద్దు ఇవ్వడానికి ప్రయత్నించింది. చివరికి ఇచ్చేసింది కూడా అసలే ఇది సోషల్ మీడియా కాలం పైగా ఎప్పుడు ఎలాంటి వీడియో దొరుకుతుందా అని ప్రత్యర్థులు ఎదురుచూసే కాలం ఇంకేముంది చంద్రబాబు ను ఆ మహిళ ముద్దు పెట్టుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను వైసీపీ శ్రేణులు తెగ ట్రోల్ చేస్తున్నాయి. దీనికి అదే స్థాయిలో టిడిపి శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. అయితే అంతటి సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఆ మహిళ చంద్రబాబుకు ముద్దు పెట్టడానికి ముందుకు రావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: