గొప్ప కట్టడాలను నిర్మిస్తే సరిపోదు వాటి గురించి కూడా ప్రచారం తెలుసుకోవాలని విషయం అప్పటి వైసిపి ప్రభుత్వానికి జగన్ కి అంతగా తట్టలేదేమో కానీ తన సొంత ప్యాలెస్ కట్టారని దుష్ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం అప్పట్లో జనంలోకి బాగా తీసుకువెళ్లింది. 430 కోట్లు వీటికి ఖర్చు చేశారని చంద్రబాబు చెప్పడం ఇదంతా దుర్వినియోగం అయిందని పలు రకాల ఆరోపణలు కూడా చేశారు.ఇదంతా కూడా ప్రజాధనం అంటూ బాధ్యత లేని ప్రభుత్వం అంటూ దుష్ప్రచారం చేశారు.
అయితే అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాలని గత పదేళ్లుగా సీఎం చంద్రబాబు చాలా తాపత్రయ పడుతున్నారు. అయితే అద్భుత నిపుణుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన రాజధాని ఎంపికలో కూడా పలు రకాల కమిటీ వేయగా.. ఆ కమిటీలను శివరామకృష్ణ ఎలాంటి అభిప్రాయాన్ని తెలియజేశారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. చంద్రబాబు నాయుడు ఆ కొత్త నగరం నిర్మించవచ్చు కానీ ఈ మహానగరం రాష్ట్రానికి కావాల్సింది ప్రాంతాల మధ్య సమతుల్యత కాదు కానీ.. చాలా వశిష్టమైన నిర్మాణం అంతేకాకుండా పెద్ద మొత్తంలో ఖర్చు అంటే అది అక్కడ నిర్మించడం నష్టమే అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేక కూడా రాశారట.
అమరావతి లో రాజధాని నిర్మాణం మంచిది కాదు అంటూ అప్పుడు పర్యావరణ వేత్తలు కూడా చెప్పారట. ఈ విషయాలను చంద్రబాబు పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. ఇప్పుడు ఏకంగా 40 వేల కోట్ల అప్పు కూడా అందుకోసం చేశారు. ఇదంతా కూడా ప్రజాధనం కాకుండా మరెవరిది అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతోంది. ఇటీవలే భారీ వర్షం రావడంతో రాజధాని ప్రాంతాలలో పరిస్థితులు ఎలా అయ్యాయో చెప్పాల్సిన పనిలేదు ఇలాంటి సమయాలలో అక్కడ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధాని నిర్మిస్తే ఎలా అంటూ వాపోతున్నారు..
ఋషికొండ చూసి జగన్ లగ్జరీ నాయకుడు రాజకీయాలకు పనికిరారని ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వాన్ని తిప్పి కొట్టలేక పోయడంలో వైసిపి విఫలమయ్యింది.. మరి ఇప్పుడు 40 వేల కోట్ల రూపాయల అప్పు మాటేంటి అమరావతి నిర్మాణ పరిస్థితి ఏంటి అంటూ పలువురు నేతలు తెలుపుతున్నారు.. అయితే అక్కడ చాలామంది నేతలు భారీగానే ఆస్తి విలువలు కలిగి ఉండడం చేత అక్కడే రాజధానిని నిర్మించాలని కుతూహలతో ప్రభుత్వం ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎవరు ఎవరిని విమర్శిస్తారో చూడాలి.