ప్రభుత్వం పైన సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఎక్కడా కూడా కనిపించలేదని నిత్యం ఏదో ఒక అరాచకాలు చేస్తూ వైసిపి నేతలపైన తప్పుడు కేసులు పెట్టడమే ఆనవాయితీగా మారిపోయింది అంటు తెలియజేశారు. ఇక టిడిపి నేతలు అందరూ కూడా అడ్డంగానే దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారంటూ విమర్శించారు. తిరుపతి లడ్డు పైన కూడా చంద్రబాబు విష ప్రచారం చేశారని సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ అమలు చేయకపోతే విమర్శిస్తారు అంటూ అందుకే ఇలాంటి పని చేస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. 53,000 కోట్లు అప్పులు చేశారంటూ వైసీపీ నేతలు విమర్శించారు.
త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రతి ఒకరు కార్యకర్తలను పార్టీకి సిద్ధం చేసుకోండి.. వచ్చే ఎన్నికలలో వైసిపిదే విజయం కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు.. ఎలాంటి కేసులు పెట్టిన ఎవరూ వెనకడుగు వేయవద్దు కచ్చితంగా అందరి వెనుక నేతలు అధినేత ఉంటారంటూ తెలిపారు. ఎక్కడ ఎవరు అధైర్యపడవద్దు అంటూ సజ్జన రామకృష్ణ కూడా తెలియజేశారు.. వైసిపి పార్టీకి ఆధారం మూలం బలం కూడా కార్యకర్తలే అంటూ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో మోడీ ,చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ప్రజలను మోసం చేశారని తెలిపారు. అధికార యంత్రాంగంతో వైసీపీని ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదంటూ మూడు పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చిన కూడా తగ్గేది లేదంటూ తెలిపారు పేర్ని నాని.