ఈమధ్య ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే ప్రాంతం ఏదైనా సరే ప్రతి ఒక్కరు ఉత్సాహం చూపిస్తున్నారు.. ముఖ్యంగా అమెరికా వంటి ప్రాంతాలలో కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే ఎవరు గెలుస్తారని ఎవరు గెలిస్తే ఎవరికి మేలు జరుగుతుందనే విషయం పైన ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అక్కడ ఓటర్లు కూడా ఓటు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నార. ఈనెల 5వ తేదీన అంటే రేపటి రోజున పోలింగ్ జరగబోతుందని.. సుమారుగా 6.8 కోట్ల మంది ఓటు వినియోగించుకున్న బోతున్నారట. మరొకవైపు అభ్యర్థులలో డోనాల్డ్ ట్రంప్, కమలహరిస్ తమ ప్రచార భాగంలో చివరి అంశంలో ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారట.


గతంలో కంటే ఈసారి ఓటింగ్ చేయడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్స్ భారీగానే రావడంతో పోలింగ్ కేంద్రాలను కూడా అమెరికాలో పెంచాల్సి వస్తోందట. బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ తో పాటుగా డిప్యూటీ విన్సెంట్ ఇగ్నీజియో ఎన్నికల పనులలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ముందస్తు ఓటింగ్ లో న్యూయార్కు సరికొత్త రికార్డు సృష్టించింది అట. ఇప్పుడు ఇదే ట్రెండ్ అమెరికా అంతటా కూడా కొనసాగుతోందని సమాచారం. గత ఎన్నికలలో న్యూయార్క్ లో 100 ముందస్తు పోలింగ్ కేంద్రాలను సరిత ఏర్పాటు చేయగా ఇప్పుడు 50% అధికంగా ఏర్పాటు చేయబోతున్నారట.


ఇక అభ్యర్థుల ప్రచార విషయానికి వస్తే ట్రంప్.. తమకు అనుకూలమైన నార్త్ కరోలినాలో ప్రచారం చేయగా కమలహారి పలు రకాల ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నది.. ట్రంప్ రేపటి రోజు వరకు నార్త్లో కరోలినాలో ఉండి మరి ర్యాలీలు నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారట.. ఇక్కడ 2016, 2020 వరకు తనకు మద్దతుగా నిలిచిన ఈ రాష్ట్రం పైనే ఆయన ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక కమలహారిస్ కూడా శనివారం రోజున కరోలినాలు ప్రచారం చేశారు సోమవారం రోజున తన భర్త గ్రీన్ విల్లేకు పంపించబోతున్నట్లు సమాచారం.


దీంతో ఓటర్లు ఎవరు ఎటువైపుగా మొగ్గుతారని విషయం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. సుమారుగా అక్కడ 78 లక్షల మంది ఓటర్లు ఉన్నారట. మరి వీరంతా ఎవరి పక్షాన ఉంటే వారి విజయం ఖాయం అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని సర్వేలు డోనాల్డ్ ట్రంప్ గెలుస్తారని చెప్పగా.. మరికొన్ని సర్వేలు కమలహారిస్ గెలుస్తారని చెబుతూ ఉన్నారట


ముఖ్యంగా అక్కడ 59% స్వేతజాతుల వారు ఉన్నారని.. మిగిలిన 41% ఇతర దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారట. ఈ 41 శాతం లో నాలుగు జాతులు కీలకంగా ఉన్నారట. ఫలితాలు అన్నీ కూడా వీరి మీద ఆధారపడి ఉంటాయట.. ఆఫ్రో అమెరికన్లు, ఏషియన్లు, స్పానిష్ మాట్లాడే హిస్పానియన్లు, వీళ్లే డిసైడ్ చేస్తూ ఉంటారట.. యూఎస్ఏ జనాభాలో స్పానిష్ మాట్లాడేవారు 19.1 శాతం ఉన్నారట వీరి ఓట్ల చాలా కీలకమట. అలాగే ఇండియా నుంచి వచ్చిన వారు 26 లక్షల మంది అక్కడ ఉన్నారట. వీరు కూడా చాలా కీలకపాత్ర పోషిస్తున్నారట. మరి మొత్తానికి ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: