1995 సంవత్సరంలో ఈ చట్టానికి తొలిసారి సవరణలు జరిగాయి. ఆ సమయంలో వక్ఫ్ చట్టానికి మరిన్ని అధికారాలను కల్పించారు. 2013 సంవత్సరంలో యూపీఏ2 సర్కార్ మరిన్ని సవరణలు చేసి వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాన్ని కల్పించడం జరిగింది. ఈ విశేష అధికారాల వల్ల ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే ఛాన్స్ తో పాటు కోర్టులలో సైతం వక్ఫ్ బోర్డ్ నిర్ణయాలను సవాల్ చేసే ఛాన్స్ అయితే లేదు.
దేశంలో 30 వక్ఫ్ బోర్డులు ఉండగా ఒక గ్రామం తమదేనంటూ వక్ఫ్ బోర్డ్ తమిళనాడు రాష్ట్రంలో చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ఈ వక్ఫ్ బోర్డ్ కు ఉన్న అపరిమిత అధికారాలను తొలగించి సవరణలు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. బోర్డ్ ఆస్తుల నిర్వహణను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని కేంద్రం భావిస్తోంది. ముస్లింలు సవరణలను వ్యతిరేకిస్తుండగా మిగతా మతాల వాళ్లు సవరణలు అవసరమని చెబుతున్నారు.
ఈ బిల్లు అమలులోకి వస్తే గతంలో తరహా పరిస్థితులు వక్ఫ్ బోర్డ్ కు అయితే ఉండవని చెప్పవచ్చు. వక్ఫ్ బోర్డ్ సవరణలు అమలులోకి వస్తాయో రావో చూడాల్సి ఉంది. వైసీపీ ముస్లింల మద్దతు కోల్పోకుండా తెలివిగా అడుగులు వేస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లు గురించి ప్రజల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. వైసీపీ , కూటమి ఏపీ రాజకీయాలకు సంబంధించి ప్రతి విషయంలో భిన్నంగా అడుగులు వేస్తున్నాయి. వక్ఫ్ బోర్డ్ విషయంలో అన్ని వర్గాల ప్రజలను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు.